ఇక అక్షయ్‌కుమార్‌తో సినిమాలు చేయడం కష్టమే! | Akshay Kumar's bonding with Sonakshi Sinha irks wife Twinkle? | Sakshi
Sakshi News home page

ఇక అక్షయ్‌కుమార్‌తో సినిమాలు చేయడం కష్టమే!

Published Mon, Jun 30 2014 11:48 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

ఇక అక్షయ్‌కుమార్‌తో సినిమాలు చేయడం కష్టమే! - Sakshi

ఇక అక్షయ్‌కుమార్‌తో సినిమాలు చేయడం కష్టమే!

‘ఆ జంట సూపర్ హిట్.. ఆ ఇద్దరి కెమిస్ట్రీ అదుర్స్’ అని అక్షయ్‌కుమార్, సోనాక్షీ సిన్హా గురించి హిందీ చిత్రసీమలో చెప్పుకుంటుంటారు. ఈ ఇద్దరూ కలిసి దాదాపు అరడజను సినిమాల్లో నటిస్తే, వాటిల్లో విజయం సాధించినవే ఎక్కువ. అందుకే అక్షయ్, సోనాక్షీ జంటగా సినిమాలు చేయడానికి బాలీవుడ్ దర్శక, నిర్మాతలు ఇష్టపడతారు. కానీ, అక్షయ్ భార్య ట్వింకిల్ ఖన్నా మాత్రం ఈ విషయంలో అంత సుముఖంగా లేరట. గతంలో అక్షయ్, ప్రియాంక చోప్రా జంటకు మంచి పేరొచ్చినప్పుడు ట్వింకిల్ చాలా కంగారుపడ్డారనే వార్త హల్‌చల్ చేసింది.
 
 ‘ఇక ప్రియాంకతో సినిమాలు చేయకూడదు’ అని తన భర్తకు నిబంధన విధించారనే వార్త కూడా వచ్చింది. ఆ తర్వాత ఈ జోడీ తెరపై కనిపించకపోవడంతో ఆ వార్త నిజం అని నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం సోనాక్షీ విషయంలో కూడా భర్తకు అదే నిబంధన విధించారట. విడిగా కూడా అక్షయ్‌తో సోనాక్షీ స్నేహంగా ఉండటంపట్ల ట్వింకిల్ అభద్రతాభావానికి గురై ఉంటారన్నది కొంతమంది ఊహ. ఏదేమైనా ఇక అక్షయ్, సోనాక్షీ జోడీ తెరపై కనిపించడం కష్టమేనని బాలీవుడ్‌వారు అంటున్నారు. అక్షయ్, సోనాక్షీ నటించిన ‘హాలిడే’ ఇటీవల విడుదలై, విజయ విహారం చేస్తోంది. బహుశా ఈ కాంబినేషన్‌లో ఇదే చివరి సినిమాయేమో అనే ఊహాగానాలున్నాయి. మరి.. ఈ ఊహ ఎంతవరకు నిజమో కాలమే చెప్పాలి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement