
ముంబై : బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ తన భార్యకు అరుదైన గిఫ్ట్ ఇచ్చారు. కపిల్ శర్మ షో నుంచి ఆయన ఉల్లిపాయలతో చేసిన ఇయర్ రింగ్స్‌ను ఆమెకు అందించగా ఆమె ఎలాంటి ఆశ్చర్యానికీ లోనవకుండా వాటిని స్వీకరించారు. తన భర్త తనకు మంచి బహుమతి ఇచ్చారంటూ ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. కొన్ని సార్లు చిన్నవిషయాలు సైతం మన మనసుల్ని తాకుతాయి అంటూ ఆమె ఈ పోస్ట్‌లో వ్యాఖ్యానించారు. ఖిలాడీతో పాటు కరీనా కపూర్, కియార అద్వానీలతో తెరకెక్కిన గుడ్‌న్యూస్ మూవీ ప్రమోషన్ కోసం అక్షయ్ కుమార్ ఇటీవల కపిల్ శర్మ షోకు వెళ్లారు. ధర్మ ప్రొడక్షన్స్ పతాకంపై రాజ్ మెహతా నిర్ధేశకత్వంలో కరణ్ జోహార్ ఈ సినిమాను నిర్మించారు. ఉల్లి ధరలు ఎగబాకిన క్రమంలో ఈ గిఫ్ట్ కూడా ఖరీదైనదేనని నెటిజన్లు భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment