'మా ఆయన సరసన హీరోయిన్ గా జయలలిత'
ముంబై: తన భర్త అక్షయ్ కుమార్ సరసన హీరోయిన్ గా జయలలిత నటించాలని కోరుకుంటున్నట్టు రచయిత్రిగా మారిన నటి ట్వింకిల్ ఖన్నా సరదాగా వ్యాఖ్యానించింది. తన మొదటి పుస్తకం 'మిసెస్ ఫన్నీబోన్స్: షీజ్ జస్ట్ లైక్ యూ అండ్ ఏ లాట్ లైక్ మీ హియర్'ను మంగళవారం సాయంత్రం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దర్శకుడు కరణ్ జోహర్ అడిగిన ప్రశ్నలకు ఆమె తనదైన శైలిలో జవాబిచ్చారు. సినిమా నటులు, రాజకీయ నాయకులతో పాటు వివిధ అంశాలపై వంగ్యాస్త్రాలు సంధించారు.
వారిద్దరి సంభాషణ సాగిందిలా...
కరణ్: అక్షయ్ తర్వాతి సినిమాలో హీరోయిన్ ఎవరు నటిస్తే బాగుంటుందని అనుకుంటున్నారు.
ట్వింకిల్: జయలలిత. ఆమె గొప్ప పోరాటయోధురాలు.
కరణ్: మీరు ఎవరితో రియారిటీ షో చేయాలనుకుంటున్నారు
ట్వింకిల్: వివాదస్పద సన్యాసిని రాధే మాతో...
కరణ్: రణబీర్ కపూర్ గురించి ఏం చెబుతారు
ట్వింకిల్: కత్రినా కైఫ్ నా నాలుకపై ఉంది కాబట్టి రణబీర్ గురించి మాట్లాడలేను.
కరణ్: దీపికా పదుకునే గురించి చెప్పండి
ట్వింకిల్: ఆమె ఏమైనా చేయగలదు.
కరణ్: ప్రధాని నరేంద్ర మోదీని కలిస్తే ఏం అడుగుతారు
ట్వింకిల్: మా ఆయనకు క్రీడా శాఖ మంత్రి పదవి ఇవ్వమంటా
కరణ్: ఆమిర్ ఖాన్ ఫోన్ లో ఏమున్నాయి
ట్వింకిల్: గ్రహాంతర వాసుల నగ్న చిత్రాలు
కరణ్: అక్షయ్ గురించి ఎవరికీ తెలియని సంగతులు చెప్పండి
ట్వింకిల్: సినిమాల్లో ట్రాజెడీ సీన్లు చూసినప్పుడు ఏడుస్తుంటాడు. ప్రతి రాత్రి గళ్ల పైజామా ధరిస్తారు. ఎప్పుడో ఒకసారి డ్రింక్ చేస్తాడు.
కరణ్: పోర్న్ వెబ్ సైట్ల నిషేధంపై మీ అభిప్రాయం
ట్వింకిల్: తల్లిగా సంతోషిస్తున్నా. కానీ పౌరురాలిగా విబేధిస్తున్నా
కరణ్: స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణించే 377 సెక్షన్ గురించి మీ కామెంట్
ట్వింకిల్: చెట్టును పెళ్లి చేసుకునేందుకు అభ్యంతరం చెప్పరు కానీ స్వలింగ సంపర్కుల వివాహానికి ససేమీరా అంటారు