
తాజాగా జరిగిన ఓ అవార్డుల ఫంక్షన్‌లో బాలీవుడ్ హీరోయిన్ కత్రినా కైఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ట్వింకిల్ ఖన్నా అంటే తనకు చాలా భయమన్నారు కత్రినా. కొద్ది రోజుల క్రితం జరిగిన ఈ ఫంక్షన్‌లో ‘మోస్ట్ స్టైలీష్ పర్సన్’ అవార్డు అందుకున్నారు కత్రినా. అనంతరం ఆమె ప్రసంగిస్తూ.. ‘ఈ అవార్డు నాకు ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. ఇక్కడకు వచ్చేటప్పుడు నేను ఒక విషయం గురించి ఆలోచిస్తు ఉన్నాను. ఈ ఫంక్షన్‌కి ట్వింకిల్ ఖన్నా రాకుండా ఉంటే బాగుంటుంది అనుకున్నాను. ఎందుకంటే ఆమె చాలా చక్కగా, గొప్పగానే కాక చమత్కారంగా మాట్లాడతారు. ఆమె ప్రత్యేకత ముందు నా అవార్డు పెద్ద విషయం కాద’న్నారు.
‘నేను ఈ వేదిక మీదుగా ట్వింకిల్ ఖన్నాకు ఓ విషయం చెప్పదల్చుకున్నాను. మీరంటే నాకు చాలా ఇష్టం. మీరు చాలా బాగా మాట్లాడతారు.. అవన్నీ కూడా వాస్తవాలే’ అంటూ ట్వింకల్ ఖన్నా మీద ప్రశంసల వర్షం కురిపించారు కత్రినా. అక్షయ్ కుమార్, కత్రినా కలిసి తీస్ మార్ ఖాన్, సింగ్ ఇజ్ కింగ్, నమస్తే లండన్ వంటి విజయవంతమైన చిత్రాల్లో నటించారు.
Comments
Please login to add a commentAdd a comment