'పెళ్లిరోజున ఆయన ఇచ్చినదేమిటో తెలుసా' | Twinkle gets 'blank look' from Akshay on wedding anniversary | Sakshi
Sakshi News home page

'పెళ్లిరోజున ఆయన ఇచ్చినదేమిటో తెలుసా'

Published Sun, Jan 17 2016 10:14 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

'పెళ్లిరోజున ఆయన ఇచ్చినదేమిటో తెలుసా' - Sakshi

'పెళ్లిరోజున ఆయన ఇచ్చినదేమిటో తెలుసా'

ముంబై: 'పెళ్లిరోజున మీ ఆయన మీకేం ఇచ్చారు? హా..! ఇచ్చారు ఓ బిత్తరచూపు'.. 'పెళ్లిరోజున మీ ఆయన ఏమైనా ఇచ్చారా? ఔను! తలనొప్పి ఇచ్చారు'.. ఇవీ ఒకప్పటి బాలీవుడ్ హీరోయిన్‌, ప్రస్తుత వ్యాపారవేత్త, యాక్షన్ స్టార్‌ అక్షయ్‌కుమార్ భార్య ట్వింకిల్ ఖన్నా సంధించిన జోక్స్‌. ఈ బాలీవుడ్ దంపతులు ఆదివారం 15వ పెళ్లిరోజు వేడుకను జరుపుకొన్నారు.

తమ పెళ్లిరోజు గురించి భావోద్వేగానికి గురవుతూ.. ఇప్పటికీ ట్వింకిల్ ఖన్నా నుంచి చూపు మరల్చుకోలేకపోతున్నట్టు వెల్లడిస్తూ.. అక్షయ్‌కుమార్ ఓ పాత ఫొటోను ట్విట్టర్‌లో పంచుకోగా..ట్వింకిల్ ఖన్నా మాత్రం కాస్తా సరదాగా స్పందించారు. పెళ్లిరోజు గురించి సరదా జోక్స్‌ ట్వీట్‌ చేశారు. ఆ తర్వాత తాము ఆనందంగా ఉన్న ఫొటోను షేర్‌ చేస్తూ.. తమ 15 ఏళ్ల వైవాహిక జీవితంలో అక్షయ్‌ ఇలాంటి సంతోషకరమైన క్షణాలెన్నింటినో అందించారని పేర్కొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement