
అభిషేక్, ఐశ్వర్యలకు స్వాగతం చెబుతున్న అక్షయ్
దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని బాలీవుడ్ దంపతులు అక్షయ్ కుమార్, ట్వింకిల్ ఖన్నా మంగళవారం పార్టీ ఇచ్చారు.
ముంబై: దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని బాలీవుడ్ దంపతులు అక్షయ్ కుమార్, ట్వింకిల్ ఖన్నా ముంబైలోని తమ నివాసంలో మంగళవారం పార్టీ ఇచ్చారు. ఈ విందుకు బాలీవుడ్ లోని ప్రముఖ నటీనటులు హాజరయ్యారు. అక్షయ్, ట్వింకిల్ దంపతులకు శుభాకంక్షలు తెలిపారు. దీంతో అక్షయ్ నివాసంలో సందడి వాతావరణం నెలకొంది.
అమితాబ్, జయా బచ్చన్, అనుమమ్ ఖేర్, కిరణ్ ఖేర్, జాకీష్రాఫ్, జితేంద్ర, రిషి కపూర్, సునీల్ షెట్టి, మాధవన్, కరణ్ జోహార్, అభిషేక్, ఐశ్వర్య, ఏక్తా కపూర్, కరిష్మా కపూర్, రితేశ్ దేశ్ ముఖ్, జెలీనియా, లారా దత్తా, తదితర సెలబ్రిటీలు పార్టీకి హజరయ్యారు.