స్పాండిలోసిస్‌ అంటే..? | What Is Spondylosis, Know Its Symptoms And Causes And Treatment, Explained In Telugu | Sakshi
Sakshi News home page

స్పాండిలోసిస్‌ అంటే..?

Published Tue, Nov 5 2024 11:10 AM | Last Updated on Tue, Nov 5 2024 3:51 PM

Spondylosis Symptoms And Causes And Treatment

స్పాండిలోసిస్‌ అనేది వెన్నెముకకు సంబంధించిన సమస్య. వాస్తవానికి ఇది ఒక రకమైన ఆర్థరైటిస్‌ (అంటే ఎముకల అరుగుదల వల్ల వచ్చే రుగ్మత) అని చెప్పవచ్చు. 

ఈ సమస్య మెడ భాగంలో వస్తే దాన్ని సర్వైకల్‌ స్పాండిలోసిస్‌ అని, నడుము భాగంలో వస్తే లంబార్‌ స్పాండిలోసిస్‌ అంటారు. 

స్పాండిలోసిస్‌కు కారణాలు:  వెన్నులో కూడా అనేక జాయింట్స్‌ ఉంటాయి. అవి అరిగాక ఒక ఎముక మరో ఎముకతో రాసుకుపోయే సమయంలో వాటి మధ్యన ఉండే నరాలు నలిగిపోయి నొప్పి రావచ్చు. స్పైన్‌ దెబ్బతిని కూడా నొప్పి రావచ్చు. 

సర్వైకల్‌ స్పాండిలోసిస్‌లో మెడనొప్పితోపాటు తలనొప్పి తల అటు–ఇటు తిప్పడం కష్టమవుతుంది. మెడ బిగుసుకుపోయినట్టుగా ఉంటుంది. నొప్పి మెడ నుంచి భుజాలు, చేతుల వరకు పాకుతున్నట్టుగా వస్తుంది 

లంబార్‌ స్పాండిలోసిస్‌లో నడుమునొప్పి, కొన్నిసార్లు నడుము నొప్పితోపాటు మెడ నొప్పి కూడా ఉంటుంది. నొప్పి నడుము నుంచి ఒకవైపు కాలు, పాదం వరకు వ్యాపిస్తుంది. దీనినే సయాటికా నొప్పిగా చెబుతారు. ఈ సమస్య నివారణ కోసం ఫిజియోథెరపిస్టులను సంప్రదించి వెన్నెముకకు సంబంధించిన వ్యాయామాలు చేయాలి. 

అలాగే మంచి పోషకాహారం తీసుకోవడం, క్యాల్షియమ్‌ ఎక్కువగా ఉండే ఆహారపదార్థాలు తీసుకోవడం వంటి ఆహారపరమైన జాగ్రత్తలు పాటించాలి. కూర్చోవడం లేదా నిల్చోవడంలో సరైన భంగిమలు (పోష్పర్స్‌) ΄పాటించాలి. డాక్టర్లను సంప్రదించి అవసరాన్ని బట్టి కొన్ని మందులు వాడాల్సి ఉంటుంది.

(చదవండి: ఒంటికి మంచిదే..మరి పంటికి?)
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement