పూల్‌ మఖానా ఎలా తీసుకుంటే మంచిదో తెలుసా..! | Amazing Health Benefits Of Phool Makhana | Sakshi
Sakshi News home page

పూల్‌ మఖానాతో ఇన్ని లాభాలా? ముఖ్యంగా పురుషుల్లో ..!

Published Fri, Jun 7 2024 1:46 PM | Last Updated on Fri, Jun 7 2024 2:39 PM

Amazing Health Benefits Of  Phool Makhana

తామర పువ్వులను సహజంగానే చాలా మంది పూజల్లో ఉపయోగిస్తుంటారు. లక్ష్మీదేవికి అత్యంత ప్రీతిపాత్రమైనవి కనుక తామరపూలను పూజల్లో వాడుతుంటారు. అయితే తామర పువ్వుల నుంచి తీసిన గింజలను మార్కెట్‌లో విక్రయిస్తున్నారు. వీటినే పూల్‌ మఖానా అని పిలుస్తారు. ఇవి ఖారీదు కూడా ఎక్కువే అయినా ఆరోగ్యానికి అందించే ప్రయోజనాలు మాత్రం అమోఘం. అలాంటి మఖానాలను ఎలా తీసుకుంటే మంచిదో సవివరంగా తెలుసుకుందాం.

చాలా మంది ఆరోగ్య నిపుణులు మఖాానాను తక్కువ నూనెలో లేదా నెయ్యిలో వేయించి తింటే ప్రయోజనకరంగా ఉంటుందని చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల రుచికరమైన, ఆరోగ్యకరమైన అల్పాహారం తీసుకున్నట్లు అవుతుంది.  ఇది అన్ని వయసుల వారికి ఉపయోగకరంగా ఉంటుంది. మఖాానాను వేయించి తింటే దాని రుచి మరింత పెరుగుతుంది. పైగా సులభంగా జీర్ణం మవుతుంది. ఇలా వేయించడం వల్ల దానిలో యాంటీఆక్సిడెంట్ లక్షణాలు  పెరుగుతాయి. అయితే అధిక ఉష్ణోగ్రత వద్ద ఎక్కువసేపు వేగ‌కుండా జ్రాగత్త పడాలి. దీని కారణంగా మఖాానాలో ఉండే విటమిన్లు, మినరల్స్ కోల్పోవచ్చు. అదే సమయంలో ఇలా వేయించిన మఖాానాలో ఎక్కువ మసాలాలు ఉపయోగించవద్దు. అదనపు మసాలా దినుసుల వల్ల కొలెస్ట్రాల్ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.

ప్రయోజనాలు

  • కాల్షియం బాగా ఉంటుంది. దీంతో ఎముకలు, దంతాలు దృఢంగా మారుతాయి. ఎముకల పెరుగుదల బాగుంటుంది. ఎముకలు విరిగిన వారు ఈ మిశ్రమాన్ని తాగితే త్వరగా అవి అతుక్కుంటాయి.

  • మఖానాలలో మెగ్నిషియం, జింక్‌, కాపర్‌ అధికంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యాన్ని అందిస్తాయి. వ్యాధులు రాకుండా రక్షిస్తాయి.

  • శిరోజాలను ఆరోగ్యంగా ఉంచుతాయి. జుట్టు రాలే సమస్య తగ్గుతుంది. శిరోజాలు దృఢంగా, ఒత్తుగా పెరుగుతాయి.

  • కంటి చూపు మెరుగు పడుతుంది. కంటి సమస్యలు తగ్గుతాయి.

  • నిద్ర చక్కగా పడుతుంది. నిద్రలేమి సమస్య నుంచి బయటపడగలుగుతారు

  • గోరు వెచ్చని పాల్లలో వేయించిన మఖానాలు వేసి, కొద్దిగా పటిక బెల్లం కలుపుకుని తీసుకుంటే..పురుషుల్లో శృంగార సామర్థ్యం పెరుగుతుంది. పైగా వీర్యం ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. అలాగే సంతానం కలిగే అవకాశాలను మెరుగు పరుస్తుంది.

(చదవండి: మనిషి ఆనందాన్ని నిర్ణయించే హార్మోనులు ఇవే..!)

 

 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement