World Malaria Day
-
Apr-25, World Malaria Day: ఏంటి? వైరల్ ఫీవరా! ఇలా జాగ్రత్త పడండి..
3, 4 రోజులకి పైబడి జ్వరంగా ఉండటం, వాంతులు, విరేచణాలు కావటం, చలిగా ఉండటం ఇవన్నీ మలేరియా వ్యాధికి కారకాలవచ్చు. మలేరియా సోకితే చాలా ప్రాణంతకంగా భావించే గత రోజుల్లో.. ప్రస్తుతం వాటికి తగిన మాత్రలు, వ్యాధి నిర్ధారణ పరీక్షలు ఎన్నో ఉన్నాయి. ఒకప్పుడు ప్రతి జ్వర పీడితుడిని పరీక్షించి, మలేరియా వ్యాధిగా గుర్తించి నిర్ధారణ పరీక్షల నిమిత్తం జాగ్రత్తలు చెప్పేవారు. కానీ ఇప్పుడు ఇలాంటి విషపూరిత జ్వరాల నుంచి, పీడిత వ్యాధుల నుంచి ముందుగానే నివారిత వ్యాక్సిన్లు ప్రతి ఒక్కరికీ ఇస్తున్నారు. వ్యాధి సోకాక ఇబ్బంది పడటం కన్నా, ముందుగానే వ్యాధి నివారణకు, కారకాలైన దోమలను నివారించుటలో ప్రతీ ఒక్కరి పాత్ర ఎంతో ముఖ్యమైనది. నేడు 'ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం..'చార్లెస్ ఆల్ఫన్సో లావెరన్' 1880లో మనుషుల్లో మలేరియా వ్యాధికారక క్రిమిని కనుగొన్నారు. ఇది 'ప్లాస్మోడియం' జాతికి చెందిన పరాన్నజీవిగా గుర్తించారు. ఇవి 5 రకాలు. అవి.. ప్లాస్మోడియం నాలెస్సి, ప్లాస్మోడియం వైవాక్స్, ప్లాస్మోడియం ఫాల్సిపారమ్, ప్లాస్మోడియం మలేరియే, ప్లాస్మోడియం ఓవేల్. ఈ పరాన్నజీవులతో మలేరియా సోకే అవకాశం ఉంది.ఈ క్రిమి మనుషుల్లో ఒకరి నుండి మరొకరికి దోమల ద్వారా వ్యాపిస్తుందని నిర్ధారించడం జరిగింది. ఈ వ్యాధిని అధికంగా అనుభవించిన ఆఫ్రికా ఖండం 2001లో “ఆఫ్రికా మలేరియా డే" ఆచరించిగా. ప్రపంచ దేశాలు ఏప్రిల్ 25ను 'వరల్డ్ మలేరియా డే'గా ఆచరిస్తూ వస్తున్నాయి.ఇలా వ్యాపిస్తుంది..అపరిశుభ్రత వాతావరణం, చెత్తా చెదారంతో కూడిన తడి ప్రదేశాలతో వ్యాధికి అవకాశంఆడ అనాఫిలిస్ దోమకాటుతో ఒకరి నుంచి మరొరికి వ్యాధికారక క్రిమి ప్లాస్మోడియాగా వ్యాప్తి చెందుతుంది.ఈ వ్యాధి దోమకుట్టిన 8 నుంచి 12 రోజుల్లో లక్షణాలు బయటపడతాయి.చిన్నపిల్లలకు, గర్భిణులకు త్వరగా సోకడమే కాకుండా చాలా ప్రమాదకరంగా మారుతుంది.వ్యాధి లక్షణాలు..చలి, వణుకుతో కూడిన జ్వరం రావడం. వాంతులు విరేచణాలు కావడం.ప్లాస్మోడియా జాతికి చెందిన రెండు క్రిముల వల్ల పరసర ప్రాంతాలలో మలేరియా సోకే అవకాశం.ఇందులో వైవాక్స్ మలేరియా తక్కువగా బాధిస్తే, పాల్సిఫారమ్ మలేరియా ఎక్కువ బాధిస్తుంది. కొన్ని పరిస్థితుల్లో ప్రాణాపాయం కూడా ఉండవచ్చు.మురికి, నీటి నిలువ, రద్దీ ప్రాంతాల్లో పాల్సిఫారమ్ మలేరియా ఎక్కువగా సోకుతుంది.మైదాన, పట్టణ ప్రాంతాల్లో వైవాక్స్ మలేరియా ఎక్కువగా ప్రబలుతోంది.మలేరియా రాకుండా జాగ్రత్తలు..వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పాటించడం తప్పనిసరి.ఇళ్లలో, చుట్టూర పరిసర ప్రాంతాల్లో దోమల దోమలపొగగానీ, మందుగానీ చల్లించాలి.నివసిస్తున్న ప్రదేశాల చుట్టూ నీటి నిల్వలు లేకుండా చూడాలి.అనాఫిలిస్ దోమలు మంచినీటి నిల్వల్లో గుడ్లు పెట్టి.. లార్వా, ప్యూపాగా పెరిగి పెద్ద దోమలుగా మారే అవకాశం.. కనుక వాటి నుంచి ముందు జాగ్రత్తలు తీసువకోవాలి.ఖాళీ కడుపుతో మలేరియా చికిత్స మాత్రలు మింగరాదు. డాక్టర్ సూచనల మేరకు వాటిని ఉపయోగించాలి.వ్యాధి నిర్ధారణ పరీక్షల్లో సత్వర విధానాలు, చికిత్సలో సంయుక్త ఔషధ పద్దతులు, దోమల నియంత్రణకు వినియోగించే నూతన కీటక సంహారిణీలచే.. వ్యధిని అరికట్టవచ్చు.దీర్ఘకాలం వినియోగించగలిగిన దోమతెరలు, ఆరోగ్యసేవల అందుబాటు మొదలైన నూతన విధానాలతో మలేరియా వ్యాధి నివారణ సాధ్యపడుతుంది.ఇవి చదవండి: Parenting Tips: పిల్లలో చురుకుదనాన్ని పెంచే ఆటలివే..! -
World Malaria Day: ‘మలేరియా’తో జరపైలం.. నిర్లక్ష్యం చేస్తే
సాక్షి, మహబూబ్‌నగర్: జ్వరమే కదా అని తేలిగ్గా తీసుకుంటే అది మలేరియా కావచ్చు. ప్రాణాంతకంగా మారొచ్చు. సరైన సమయంలో సరైన చికిత్స తీసుకుంటే ప్రమాదం నుంచి బయటపడొచ్చు. కానీ వ్యాధి బారినపడకుండా ముందస్తుగా తీసుకోవాల్సిన చర్యలు అత్యంత ముఖ్యం. సోమవారం ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం.. వ్యాధి ఇలా సోకుతుంది.. ఎనాఫిలిస్ అనే ఆడదోమ కుట్టినప్పుడు మనిషి శరీరంపై ప్లాస్మోడియం పొరసైట్ అనే పరాన్నజీవిని వదులుతుంది. దోమకాటు వల్ల ఏర్పడిన రంధ్రంలో నుంచి మనిషి రక్తంలోకి పరాన్నజీవి ప్రవేశించి విస్తరిస్తుంది. ఈ పరాన్నజీవి రక్తంలోని రోగనిరోధక వ్యవస్థగా ఉన్న ఎర్ర రక్తకణాలపై దాడి చేస్తుంది. దీనిమూలంగా మనిషికి రోజువిడిచి రోజు జ్వరం సోకుతుంది. సరైన సమయంలో సరైన చికిత్స తీసుకొని పక్షంలో రోగనిరోధక వ్యవస్థ దెబ్బతిని రోగికి ప్రాణాంతకమవుతుంది. సుమారు 20రకాల ఎనాఫిలిస్‌దోమలు మలేరియా వ్యాప్తికి కారణమవుతున్నాయి. మలేరియా వ్యాధికి ప్రపంచంలో ప్లాస్మోడియం వైవాక్స్, ప్లాస్మోడియం ఫాల్సిపేరం, ప్లాస్మోడియం మలేరియా, ప్లాస్మాడియం ఓవేల్ అనే నాలుగు రకాల పరాన్నజీవులు వ్యాధి తీవ్రతకు కారణమవుతున్నాయి. మనదేశంలో ప్లాస్మోడియం వైవాక్స్, ప్లాస్మోడియం, పాల్సిపేరం అనే రెండు రకాల పరాన్నజీవులు కారణమవుతున్నాయి. వీటిలో ప్లాస్మోడియం పాల్సిపేరు అనే పరాన్నజీవి మలేరియా వ్యాధి తీవ్రతను పెంచి ప్రాణాంతకంగా మారుతోంది. నిరు నిల్వ ఉండే సంపులు, ఇతర నీటి పాత్రలు మురుగునీటి నిల్వ ప్రదేశాలు వ్యాధికారక దోమలకు ప్రధాన కేంద్రాలుగా మారుతాయి. వీటిలో దోమలు ఆవాసాలు ఏర్పాటు చేసుకుని గుడ్లుపెట్టి సంతానోత్పత్తి చేస్తాయి. ఇవి పెరిగి వ్యాధికారకంగా మారతాయి. నివారణ మార్గాలివి.. మలేరియా వ్యాధి రాకుండా నివారించడానికి ఎటువంటి టీకా మందులు లేవు. కేవలం దోమ కాటు నుంచి రక్షించుకోవడమే ప్రధాన మార్గం. మురుగు నిల్వ ఉన్న ప్రదేశాల్లో కాలిన ఇంజిన్‌ఆయిల్, కిరోసిన్, డీడీటీ పౌడర్‌ను పిచికారీ చేయాలి. 5మి.లీ టెమిపాస్ 50శాతం ఇసీ మందును 10లీటర్ల నీటిలో కలిపి మురుగు కాల్వలు, వర్షపు నీటి గుంతలు, బోర్లు, నల్లాల వద్ద ఏర్పడే నీటి గుంతల, ఖాళీ చేయలేని నీటినిల్వ సంపులు, డ్రమ్ములలో పంచాయతీ సిబ్బంది పిచికారీ చేయాలి. ఈ ద్రావణం తినుబండారాలపై పడకుండా చర్యలు తీసుకోవాలి. కూలర్లు, పూలకుండీలు, నీటి డ్రమ్ములు, వాటర్ ట్యాంకుల్లో లార్వా పెరుగుతుంది. వీటిలో నీటిని మారుస్తూ ఉండాలి. సంపులపై ట్యాంకులపై మూతలు పెట్టాలి. వారానికి ఒకసారైనా శుభ్రం చేయడం వల్ల లార్వా ఉంటే చనిపోతుంది. పాతటైర్లు, పాత్రలు, కొబ్బరి చిప్పలు వంటివి పరిసరాల్లో ఉండకుండా చూసుకోవాలి. పడుకునే సమయంలో దోమతెరలు వాడాలి. దోమలను తరిమి వేసే కాయిల్స్ వంటివి ఉపయోగించాలి. ఇంట్లో కర్టెన్లు తరచూ మారుస్తూ ఉండాలి కిటికీలకు జాలీలను అమర్చుకోవడం ద్వారా దోమలు ఇంట్లోకి రాకుండా చాలావరకు నివారించవచ్చు. కలుషిత నీటి ముప్పును ఎదుర్కొనేందుకు కాచి వడబోసిన నీటిని తాగటం చాలా అవసరం. ఫిల్టర్లు వాడటం వల్ల కూడా ఉపయోగం ఉంటుంది. కాచి చల్లార్చి వడబోసిన నీళ్లే ఎక్కువ సురక్షితం. -
మలేరియా లేని ప్రపంచం కోసం...
చార్లెస్ ఆల్ఫన్సో లావెరన్ 1880లో మనుషుల్లో మలేరియా వ్యాధికారక క్రిమిని కనుగొన్నారు. దీనిని ‘ప్లాస్మోడియం’ జాతికి చెందిన పరాన్నజీవిగా గుర్తించారు. ప్లాస్మోడియం నాలెస్సి, ప్లాస్మోడియం వైవాక్స్, ప్లాస్మోడియం ఫాల్సిపారమ్, ప్లాస్మోడియం మలేరియే, ప్లాస్మోడియం ఓవేల్ అనే ఐదు రకాల పరాన్నజీవుల వలన మానవులకు మలేరియా సోకుతోంది. 1897లో సర్ రోనాల్డ్ రాస్ ఈ క్రిమి మనుషుల్లో ఒకరి నుండి ఒకరికి దోమల ద్వారా వ్యాపిస్తుందని నిర్ద్ధరించారు. ఇందుకుగానూ ఆయనకు 1902లో నోబెల్ బహుమతి లభించింది. ‘అనాఫిలస్’ జాతికి చెందిన ఆడ దోమల వలన మలేరియా వ్యాధికారక క్రిమి వ్యాప్తి చెందుతుంది. మలేరియా వ్యాధి తీవ్రతను అధికంగా అనుభవించిన ఆఫ్రికా ఖండం 2001లో ‘‘ఆఫ్రికా మలేరియా డే’’ ఆచరించింది. అదే స్ఫూర్తితో 2008 నుండి ఏప్రిల్ 25ను ‘వరల్డ్ మలేరియా డే’గా ఆచరిస్తూ ఉన్నాయి ప్రపంచ దేశాలు. జెనీవాలోని ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం 2020వ సంవత్సరంలో ప్రపంచ వ్యాప్తంగా 24 కోట్ల 10 లక్షల మంది మలేరియా వ్యాధి బారినపడగా, 6 లక్షల 27 వేల మంది చనిపోయారు. ఇక మనదేశం విషయానికివస్తే 2021లో అధికారికంగా 1,58,326 మలేరియా కేసులు గుర్తించగా, 80 మరణాలు సంభవించాయి. వ్యాధి నిర్ధారణ, చికిత్స, నియంత్రణల్లో కనుగొన్న నూతన ఆవిష్కరణల ఫలితంగా గత 10 సంవత్సరాల్లో మలేరియా వ్యాధి ప్రపంచవ్యాప్తంగా గణనీయంగా తగ్గుముఖం పట్టింది. వ్యాధి నిర్ధారణ పరీక్షల్లో సత్వర విధానాలు, చికిత్సలో సంయుక్త ఔషధ పద్దతులు, దోమల నియంత్రణకు వినియోగించే నూతన కీటక సంహారిణీలు, దీర్ఘకాలం వినియోగించ గలిగిన దోమతెరలు, ఆరోగ్యసేవల అందుబాటు మొదలైన నూతన విధానాల వలన ఇది సాధ్యమైంది. దీన్ని సాధించడంలో ప్రజలు, ప్రజాప్రతినిధులు, సంస్థలు చేసిన కృషి ఎనలేనిది. 2030 నాటికి భారత దేశం నుండి మలేరియా వ్యాధిని పూర్తిగా తొలగించడానికి పథక రచన చేశారు. – తలతోటి రత్న జోసఫ్ రిటైర్డ్ ఏడీ; ఆరోగ్య, వైద్య–కుటుంబ సంక్షేమ శాఖ -
నేడు మలేరియా డే దోమలతో జాగ్రత్త!
న్యూఢిల్లీ: ప్రణాళికలు లేని నిర్మాణ పనులు, పరిశ్రమలు, వలసల పెరుగుదల భారతదేశ పట్టణాల్లో మలేరియా కేసులు పెరగడానికి కారణమవుతున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. సరైన ప్రణాళికలు లేకుండా భవనాలు కట్టడం, పరిశ్రమలను స్థాపించడంవల్ల... దోమల పునరుత్పత్తి దోహదం చేస్తోందని, అందుకే పట్టణ ప్రాంతాల్లో మలేరియా బాధితులు అధికంగా ఉంటున్నారని మలేరియా వ్యాధుల విభాగం అధినేత జీఎస్ సోనాల్ తెలిపారు. భవననిర్మాణం చేసేవాళ్లు, పారిశ్రామిక వేత్తలు చెత్తను సరైన పద్ధతిలో పారవేసినప్పుడే దోమల పునరుత్పత్తి నివారణ సాధ్యమవుతుందని ఆయన అన్నారు. అందుకోసం కొత్త నిర్మాణాలు చేపట్టేటప్పుడు, పరిశ్రమలు నెలకొల్పేటప్పుడు తప్పనిసరిగా ఆరోగ్యశాఖను సంప్రదించాలని ఆయన సూచించారు. మురికి లేదా నిలువ ఉన్న నీటిలోని ఆడ ఎనాఫిలిస్ దోమ కాటువల్ల మలేరియా వస్తుందని, 2010లో భారత్‌లో 45వేల మలేరియా మరణాలు నమోదయ్యాయని సోనాల్ తెలిపారు. దేశం మొత్తంలో మలేరియా మృతుల సంఖ్య తగ్గిపోతుంటే.. పట్టణాల్లో మాత్రం మలేరియా కేసులు పెరుగుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తంచేశారు. దోమతెరలు ఉపయోగించడం, నిలువ నీటిని తొలగించడం, చెత్త నిల్వ ఉండకుండా చేయడం వల్ల భారతదేశంలో మలేరియా కారణంగా సంభవిస్తున్న వేల మరణాలను తగ్గించవచ్చునని నిపుణులు చెబుతున్నారు. గాలిలోని వాహకాల ద్వారా వ్యాపించే డెంగీ, మలేరియా వంటి వ్యాధుల సంఖ్య వేసవిలో పెరుగుతుందని, దోమలను బట్టి వ్యాధులు వ్యాపిస్తాయని తెలిపారు. మూతలు లేని పాత్రల్లో నీరు నిల్వచేయొద్దని, కూలర్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని సూచించారు. బహిరంగ ప్రదేశాల్లో చెత్తను పోయకుండా సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలని, నీరు నిల్వ ఉండి ఎటూ వెళ్లడానికి మార్గంలేకపోతే.. ఆ నిల్వ నీటిపై కిరోసిన్ చల్లడంవల్ల దోమలు నివారించొచ్చని ైవె ద్య నిపుణులు సలహా ఇస్తున్నారు. ఇవేవి సాధ్యంకాని సమయంలో కీటక సంహారక మందులను, దోమ తెరలను వాడాలని సూచిస్తున్నారు. దోమల నుంచి పి-వైవాక్స్, పి-ఫాల్సిపారం, పి-ఓవేల్, పి-మలేరియా అనే నాలుగు రకాల మలేరియాలు మనుషులకు వ్యాపిస్తాయని, వాటిలో మొదటి రెండు భారత ఉపఖండంలో ఎక్కువగా ఉండగా... చివరి రెండు ఆఫ్రికా దేశాల్లో ఎక్కువగా కనిపిస్తాయని చెప్పారు. వైవాక్స్ క్లోరోక్వినైన్తో వెంటనే తగ్గిపోగా... ఫాల్సిపారం అనేక సమస్యలకు కారణమవుతుందని అంటున్నారు. సరైన సమయంలో చికిత్సనందించకపోతే ఈ జ్వరం మెదడు, కిడ్నీలకు కూడా వ్యాపించే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.