డుగ్.. డుగ్..డుగ్.. అనే శబ్దం వింటే చాలు ఆ గల్లీ ఉన్న చిన్న పిల్లవాడు కూడా రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ వస్తుందని ఇట్టే గుర్తు పట్టేస్తాడు. ఒక్కమాటలో చెప్పాలంటే ఈ బైక్ కంపెనీకి ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. గతంలో ఈ ద్విచక్ర వాహనాన్ని ఎక్కువగా ధనిక వర్గం కొనేవారు. కానీ, ప్రస్తుతం మద్య తరగతి ప్రజలు కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. తాజాగా రాయల్ ఎన్ఫీల్డ్ తన కొత్త తరం క్లాసిక్ 350 మోటార్ సైకిల్ ను భారతదేశంలో ప్రారంభించింది. కంపెనీ అత్యధికంగా అమ్ముడైన ఈ రెట్రో క్రూయిజర్ అప్‌డేట్ చేసిన వెర్షన్ తో వచ్చింది.(చదవండి: నిరుద్యోగులకు అమెజాన్ తీపికబురు!)
సరికొత్త రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 గతంలో ప్రకటించిన మెటియోర్(Meteor) 350 మోటార్ సైకిల్ ఆధారంగా రూపొందించారు. ఈ మోడల్‌లో కూడా మెటియోర్ 350 లాంటి ఇంజిన్‌నే అందించారు. అయితే, దీని పవర్ మాత్రం 349సీసీ ఉండడం వల్ల 20పీఎస్ పీక్ పవర్‌ని 27ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మెటియోర్లోని జె ప్లాట్ ఫామ్‌ని ఇందులోకూడా అందించింది. ఇది 11 విభిన్న రంగులలో లభ్యం అవుతుంది. బ్లూటూత్ సహాయంతో స్మార్ట్ ఫోన్కికనెక్ట్ అయ్యి నావిగేషన్‌ని చూపించే ట్రిప్పర్ టర్న్ టు టర్న్ నావిగేషన్‌ని కలిగి ఉన్న రెండవ బైక్ ఇది. అయితే ఇందులో ముందు మోడల్స్‌లో ఉన్న విధంగా కిక్ స్టార్టర్ లేకపోవడం విశేషం.
ఈ మోటార్ సైకిల్ పైలట్ ల్యాంపులతో కొత్త హెడ్ ల్యాంప్, ఫ్యూయల్ గేజ్, ఎల్ సీడి ఇన్ఫర్మేషన్ ప్యానెల్ గల ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్ కలిగి ఉంది. పాత తరం మోడల్స్ లాగా కాకుండా మెరుగైన ఎర్గోనమిక్స్ కొరకు హ్యాండిల్ బార్ అప్‌డేట్ చేశారు. ఇది యుఎస్ బి ఛార్జర్, కొత్తగా డిజైన్ చేసిన టెయిల్ లైట్, అప్‌డేట్ చేసిన ఎగ్జాస్ట్ పైప్, 13-లీటర్ కెపాసిటీ ఫ్యూయల్ ట్యాంక్, మరింత సౌకర్యవంతమైన రైడింగ్ అనుభవం కొరకు అప్‌డేట్ చేసిన సీట్లతో వస్తుంది. ఈ బైక్ హోండా హెచ్'నెస్ సీబీ 350, బెనెల్లీ ఇంపీరియల్, జావా మోటార్ సైకిల్స్ వంటి మోడల్స్ తో పోటీ పడనుంది. రాయల్ ఎన్ ఫీల్డ్ 350 మూడు వేరియంట్లలో లభ్యమవుతుంది. ఫైర్ బాల్ వేరియంట్ ధర - రూ.1.85 లక్షలు, సూపర్ నోవా వేరియంట్ ధర - రూ. 1.86 లక్షలు, స్టెల్లార్ వేరియంట్ ధర -1.90 లక్షలుగా ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment