వీకెండ్ ఎంజాయ్!
చౌటుప్పల్: రాష్ట్ర రాజధానిలోని సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో, ఉన్నతస్థాయి కొలువుల్లో పని చేస్తున్న ఉద్యోగులు ఒత్తిడి నుంచి ఉపశమనం పొందేందుకు వారాంతంలో విశ్రాంతి కోసం పల్లెలకు వస్తున్నారు. ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ సేద తీరుతున్నారు. హైదరాబాద్‌కు చెందిన విండ్ ఛేజర్స్ గ్రూపు, వివిధ రంగాల ఉద్యోగులు రాయల్ ఎన్‌ఫీల్డ్ బైకులపై ఆదివారం రాచకొండకు వచ్చారు. అక్కడి ప్రకృతి రమణీయతను చూసి ముగ్ధులయ్యూరు. గుట్టలను ఎక్కి, పచ్చని లొకేషన్లలో తిరుగుతూ ఎంజాయ్ చేశారు. వారాంతపు విశ్రాం తికొచ్చే ఉద్యోగులు ఒత్తిడి నుంచి ఉపశమనం పొందడమే కాకుండా సమాజ శ్రేయస్సు కోసం పాటు పడుతున్నారు. బైకును నడిపే ప్రతి వ్యక్తి హెల్మెట్ ధరిస్తున్నారు. వెనకాల కూర్చున్న వ్యక్తి కూడా హెల్మెట్ ధరించడం తప్పనిసరిగా పాటిస్తున్నారు. హెల్మెట్ ఆవశ్యకత, రోడ్డు భద్రతను గురించి ప్రజలకు తెలియజేస్తున్నారు. అనాథాశ్రమాల్లో గడుపుతున్నారు. వారికి అవసరమైన వస్తువులను బహూకరిస్తున్నారు.
హైదరాబాద్‌లో 2వేల గ్రూపులు
హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో, వివిధ రంగాల్లో వారం రోజులపాటు పని ఒత్తిడిలో ఉండి, వారాంతపు విశ్రాంతి కోసం ఇలా ఆదివారం టూర్లకు వెళ్లే గ్రూపులు 2వేల వరకు ఉన్నాయి. ఒక్కో గ్రూపులో 20 మంది ఉంటారు. ఒక్కో ఆది వారం ఒక్కో ప్రాంతానికి వెళ్తుంటారు.
వారమంతా బిజీ
సినీ పరిశ్రమలో అసోసియేట్ డెరైక్టర్‌గా పనిచేస్తున్నా. వారంలో ఐదు రోజులు బిజీగా ఉంటా. ఆదివారం వచ్చిందంటే విశ్రాంతి కోసం, ఒత్తిడి నుంచి బయటపడేందుకు జాలీగా ఇలా వస్తాం. పర్యాటక ప్రాంతాల్లో పర్యటించడం ద్వారా పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచన వస్తుంది.
- పి.రామారావు, అసోసియేట్ డెరైక్టర్