థండర్‌బర్డ్‌లో కొత్త వేరియంట్‌లు | New variants in Thunderbird | Sakshi
Sakshi News home page

థండర్‌బర్డ్‌లో కొత్త వేరియంట్‌లు

Published Thu, Mar 1 2018 12:48 AM | Last Updated on Thu, Mar 1 2018 12:48 AM

New variants in Thunderbird - Sakshi

న్యూఢిల్లీ: రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ కంపెనీ థండర్‌బర్డ్‌ మోడల్‌లో కొత్త రేంజ్‌ బైక్‌లను మార్కెట్లోకి తెచ్చింది. థండర్‌బర్డ్‌ 500ఎక్స్‌ (ధర రూ.1,98,878), థండర్‌బర్డ్‌ 350 ఎక్స్‌ (ధర రూ.1,56,849– రెండు ధరలూ ఎక్స్‌ షోరూమ్, ఢిల్లీ).. ఈ రెండు బైక్‌లకు బుకింగ్స్‌ బుధవారం నుంచే ప్రారంభించామని రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ ప్రెసిడెంట్‌ రుద్రతేజ్‌ సింగ్‌ తెలిపారు. థండర్‌ బర్డ్‌ 500 ఎక్స్‌ బైక్‌ను సింగిల్‌ సిలిండర్, ఎయిర్‌కూల్డ్‌ 499సీసీ ఇంజిన్‌తో రూపొందించామని, ఈ బైక్‌ 41.3 ఎన్‌ఎమ్‌ టార్క్‌ను, 4,000 ఆర్‌పీఎమ్‌ను ఇస్తుందని పేర్కొన్నారు.

అలాగే థండర్‌బర్డ్‌ 350ఎక్స్‌లో సింగిల్‌ సిలిండర్,  ఎయిర్‌కూల్డ్‌ ట్విన్‌స్పార్క్, 346 సీసీ ఇంజిన్‌తో రూపొందించామని గరిష్ట టార్క్‌ 28 ఎన్‌ఎమ్‌ అని, 4,000 ఆర్‌పీఎమ్‌ అని తెలిపారు.  ఈ రెండు బైక్‌ల్లో..సింగిల్‌ డౌన్‌ ట్యూబ్‌ ఛాసిస్, 41ఎమ్‌ఎమ్‌ ఫ్రంట్‌ ఫోర్క్‌లు, 20 లీటర్ల ఫ్యూయల్‌ ట్యాంక్, 9 స్పోక్‌ అలాయ్‌ వీల్స్,  5 స్పీడ్‌ గేర్‌బాక్స్, ట్యూబ్‌లెస్‌ టైర్లు వంటి ప్రత్యేకతలు ఉన్నాయి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement