Thunderbird
-
థండర్‌బర్డ్‌లో కొత్త వేరియంట్లు
న్యూఢిల్లీ: రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ థండర్బర్డ్ మోడల్లో కొత్త రేంజ్ బైక్‌లను మార్కెట్లోకి తెచ్చింది. థండర్బర్డ్ 500ఎక్స్ (ధర రూ.1,98,878), థండర్బర్డ్ 350 ఎక్స్ (ధర రూ.1,56,849– రెండు ధరలూ ఎక్స్ షోరూమ్, ఢిల్లీ).. ఈ రెండు బైక్‌లకు బుకింగ్స్ బుధవారం నుంచే ప్రారంభించామని రాయల్ ఎన్ఫీల్డ్ ప్రెసిడెంట్ రుద్రతేజ్ సింగ్ తెలిపారు. థండర్ బర్డ్ 500 ఎక్స్ బైక్‌ను సింగిల్ సిలిండర్, ఎయిర్‌కూల్డ్ 499సీసీ ఇంజిన్‌తో రూపొందించామని, ఈ బైక్ 41.3 ఎన్ఎమ్ టార్క్‌ను, 4,000 ఆర్‌పీఎమ్‌ను ఇస్తుందని పేర్కొన్నారు. అలాగే థండర్బర్డ్ 350ఎక్స్‌లో సింగిల్ సిలిండర్, ఎయిర్‌కూల్డ్ ట్విన్స్పార్క్, 346 సీసీ ఇంజిన్‌తో రూపొందించామని గరిష్ట టార్క్ 28 ఎన్ఎమ్ అని, 4,000 ఆర్పీఎమ్ అని తెలిపారు. ఈ రెండు బైక్‌ల్లో..సింగిల్ డౌన్ ట్యూబ్ ఛాసిస్, 41ఎమ్ఎమ్ ఫ్రంట్ ఫోర్క్‌లు, 20 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్, 9 స్పోక్ అలాయ్ వీల్స్, 5 స్పీడ్ గేర్‌బాక్స్, ట్యూబ్‌లెస్ టైర్లు వంటి ప్రత్యేకతలు ఉన్నాయి. -
రాయల్ ఎన్ఫీల్డ్ కొత బైక్స్ లాంచ్
సాక్షి, న్యూఢిల్లీ: లగ్జరీ టూవీలర్ మేకర్ రాయల్ ఎన్ఫీల్డ్ రెండు కొత్త బైక్‌లను లాంచ్ చేసింది. థండర్ బర్డ్ 350ఎక్స్, థండర్ బర్డ్ 500ఎక్స్ పేరుతో వీటిని విడుదల చేసింది. థండర్ బర్డ్ 350ఎక్స్ ధర రూ. 1.56 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభధరగా ఉండగా 500 ఎక్స్ (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధర రూ. 1.98 లక్షలుగా ఉంది. కొత్త కాస్మొటిక్ అప్‌గ్రేడ్స్ తో యువ బైకర్లే లక్ష్యంగా వీటిని భారత మార్కెట్లో అందుబాటులోకి తెచ్చింది. రెండింటిలోనూ డే టైం ఎల్ఈడీ లైట్లను, ఇంటిగ్రెటెడ్ హెడ్ ల్యాంప్, ఎల్ఈడీ టైయిల్ ల్యాంప్‌ను అమర్చింది. చిన్న హ్యాండిల్ బార్లను మార్చడంతోపాటు కొత్త 9 స్పోక్ అల్లాయ్ వీల్స్, ట్యూబ్‌లైస్ టైర్లు జోడించింది. అలాగే అదనంగా బ్లూ, ఆరెంజ్ సహా నాలుగులు రంగల్లో ఇవి లభ్యం కానున్నాయి. 350 ఎక్స్ ఫీచర్లు 346 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ 5 స్పీడ్ గేర్‌బాక్స్ 5,250ఆర్పీఎం వద్ద 19.8బీహెచ్పీ 4000 ఆర్పీఎం 28 ఎన్ఎం పీక్ టార్క్ అందిస్తుంది 500ఎక్స్ ఫీచర్లు 499 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజీన్ 5 స్పీడ్ గేర్‌బాక్స్ 5.250 ఆర్పీఎం వద్ద 27.2 బీహెచ్పీ 4,000 ఆర్పీఎం వద్ద 41.3 ఎన్ఎం గరిష్ట టార్క్ అందిస్తుంది. -
ఎన్ఫీల్డ్ కాంటినెంటల్ జీటీః రూ. 2.05 లక్షలు
పనాజి: ఐషర్ మోటార్స్‌కు చెందిన రాయల్ ఎన్ఫీల్డ్ కొత్త బైక్, కాంటినెంటల్ జీటీను మంగళవారం మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ బైక్ ధర రూ.2.05 లక్షలు(ఆన్‌రోడ్ ధర, ఢిల్లీ). రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ ప్రస్తుతం బుల్లెట్, క్లాసిక్, థండర్బర్డ్ మోడల్ బైక్‌లను అమ్ముతోంది. 535 సీసీ ఇంజిన్ ఉన్న ఈ కాంటినెంటల్ జీటీ బైక్‌లను ఈ ఏడాది మొదట్లోనే అంతర్జాతీయ మార్కెట్లో కంపెనీ విడుదల చేసింది. పంజాబ్, ఇంకా కొన్ని రాష్ట్రాల్లో ఈ బైక్‌ను రూ. 2 లక్షలలోపు విక్రయిస్తామని, ముంబైలో ఈ బైక్ ధర రూ. 2.14 లక్షలు(ఆన్ రోడ్ ధర, ముంబై)అని కంపెనీ పేర్కొంది.