రాయల్ ఎన్‌ఫీల్డ్ (ఆర్ఈ) కంపెనీకి చెందిన కొత్త బైక్ ఈ మధ్య కొన్నారా? అయితే, మీకు ఒక తీపికబురు. కంపెనీ తాజాగా సర్వీస్ కేర్ 24 అనే కొత్త సర్వీసులను అందుబాటులోకి తీసుకువచ్చింది. రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ ఉన్న వారు ఒకసారి ఉచితంగానే ఫ్రీ సర్వీస్ పొందొచ్చు. ఈ సర్వీస్ కేర్ 24లో నాలుగు జనరల్ సర్వీసులు, రెండు సార్లు ఇంజిన్ ఆయిల్ మార్చుకోవచ్చు. అయితే, బైక్ ఛాసిస్ నెంబరు వెరిఫికేషన్ తర్వాతనే ఈ సర్వీస్ అందించనున్నట్లు తెలిపింది. సర్వీస్ కేర్ 24లో భాగంగా ఒకసారి ఫుల్ సర్విస్ చేస్తే అన్ని పన్నులతో కలిపి రూ.2,499 ఖర్చు అవుతుంది.
ఈ ప్యాకేజ్ తీసుకున్న వారికి అదనపు రిపేర్ అవసరం అయితే విడిభాగాలపై, లూబ్రికేషన్‌పై 5 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే లేబర్ చార్జీల్లో 20 శాతం తగ్గింపు సొంతం చేసుకోవచ్చు. ఈ సర్వీస్ ప్యాకేజ్ కొనుగోలు చేయాలని భావించే వారు రాయల్ ఎన్‌ఫీల్డ్ వెబ్‌సైట్‌కు వెళ్లి రిజిస్టర్ చేసుకోవచ్చు. ప్యాకేజీని కొనుగోలు చేయొచ్చు. ఆన్ లైన్ లో రిజిస్టర్ చేసిన తర్వాత ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు. రాయల్ ఎన్ ఫీల్డ్ నిపుణులు ఈ సర్విస్ అందించనున్నట్లు పేర్కొంది. మా వాహనాల పట్ల అదనపు సంరక్షణ, శ్రద్ధ అవసరం అని మాకు ఎల్లప్పుడూ తెలుసనని కంపెనీ పేర్కొంది.
చదవండి: గంటకు 70 కి.మీ వేగం.. రూ.80కే.. 800 కిలోమీటర్ల ప్రయాణం
Comments
Please login to add a commentAdd a comment