రాయల్ ఎన్‌ఫీల్డ్ వాహనాల అమ్మకాలు పడిపోయాయి. ఈ ఏడాది ఆగస్టులో కంపెనీ మొత్తం అమ్మకాలలో 5 శాతం తగ్గుదలని నివేదించింది. కంపెనీ గతేడాది ఆగస్టులో విక్రయించిన 77,583 యూనిట్లతో పోలిస్తే గత నెలలో 73,630 యూనిట్లను విక్రయించింది.
గత ఆగస్టులో కంపెనీ దేశీయ విక్రయాలు 65,624 యూనిట్లుగా ఉన్నాయి. గతేడాది ఆగస్టులో అమ్ముడుపోయిన 69,393 యూనిట్లతో పోలిస్తే ఇవి కూడా 5 శాతం క్షీణించాయి. ఇక ఎగుమతుల విషయానికి వస్తే.. రెండు శాతం పడిపోయాయి. గత నెలలో ప్రపంచవ్యాప్తంగా 8,006 యూనిట్లు ఎగుమతి కాగా గత ఏడాది ఆగస్టులో ఎగుమతి చేసిన వాహనాలు 8,190.
కస్టమర్లను ఆకర్షించి సేల్స్ పెంచుకునేందుకు కంపెనీ వివిధ ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో అత్యంత ఆదరణ ఉన్న రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 మోడల్‌కు వివిధ ఫీచర్లు జోడించి 2024 వెర్షన్‌ను ఇటీవలే విడుదల చేసింది. మోటార్‌సైకిల్ పోర్ట్‌ఫోలియో విస్తరణతో పాటు, రాయల్ ఎన్‌ఫీల్డ్ కొత్త రైడింగ్ గేర్‌లను కూడా వేగంగా విడుదల చేస్తోంది. ఇటీవల క్రాస్‌రోడర్స్ రైడింగ్ జాకెట్‌ను లాంచ్ చేసిన రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇప్పుడు రాయల్ ఎన్‌ఫీల్డ్ ఎక్స్ రివిట్ ఆల్-వెదర్ రైడింగ్ గేర్‌ను విడుదల చేసింది.
Comments
Please login to add a commentAdd a comment