
న్యూఢిల్లీ: గత ఆర్థిక సంవత్సరంలో జాగ్వార్ ల్యాండ్ రోవర్ ఇండియా అత్యధిక విక్రయాలు నమోదు చేసింది. 6,183 యూనిట్లను విక్రయించింది. 2024 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది 40 శాతం అధికం. హోల్‌సేల్ విక్రయాలు 39 శాతం పెరిగి 6,266 యూనిట్లుగా నమోదయ్యాయి.
గత ఆర్థిక సంవత్సరంలో డిఫెండర్ అమ్మకాలు అత్యధికంగా 90 శాతం, దేశీయంగా తయారు చేసిన రేంజ్ రోవర్, రేంజ్ రోవర్ స్పోర్ట్ విక్రయాలు వరుసగా 72 శాతం, 42 శాతం మేర పెరిగాయి. రిటైల్, హోల్‌సేల్ అమ్మకాల్లో పరిశ్రమను మించిన పనితీరును కనపర్చినట్లు జేఎల్‌ఆర్ ఇండియా ఎండీ రాజన్ అంబా తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ దీన్ని కొనసాగించనున్నట్లు చెప్పారు.