ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ జాగ్వార్ ల్యాండ్ రోవర్ (జేఎల్‌ఆర్) సీఈవో థియరీ బొల్లోర్ తన పదవికి రాజీనామా చేశారు. థియరీ బొల్లోర్ రిజైన్‌పై జాగ్వార్ పేరెంట్ కంపెనీ టాటా ప్రకటించింది.అయితే వ్యక్తిగత కారణాల వల‍్లే జేఎల్‌ఆర్‌కు రిజైన్ చేయాల్సి వచ్చిందని ఆయన చెప్పారు. బొల్లోర్ జాగ్వార్‌లో డిసెంబర్ 31వరకు కొనసాగనున్నారు.
రాజీనామా సందర్భంగా బొల్లోర్ మాట్లాడుతూ..‘గత రెండు సంవత్సరాలుగా జాగ్వార్ ల్యాండ్ రోవర్‌లో సాధించిన విజయాలపై గర్వరపడుతున్నాం.వారి అంకితభావం, అభిరుచికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మొత్తం సంస్థ భవిష్యత్తు మరింత ఉత్తమంగా ఉండాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
బొల్లోర్ సేవలు అమోఘం
టాటా సన్స్, టాటా మోటార్స్, జేఎల్‌ఆర్ ఛైర్మన్ చంద్రశేఖరన్ మాట్లాడుతూ..‘జాగ్వార్ ల్యాండ్ రోవర్‌లో బొల్లోర్ సేవల్ని మరువలేం. ఆందుకు ఆయనకు కృతజ్ఞతలు. విజయవంతమైన సంస్థగా పరిణితి చెందేలా పటిష్టమైన పునాదులు నిర్మించారని కొనియాడారు. తద్వారా కంపెనీ భవిష్యత్తు మరింత వృద్ధి చెందేందుకు సిద్ధంగా ఉందని ధీమా వ్యక్తం చేశారు.
తాత్కాలిక సీవోగా అడ్రియన్ మార్డెల్
32 ఏళ్లుగా జేఎల్‌ఆర్‌లో విధులు నిర్వహిస్తున్న అడ్రియన్ మార్డెల్ మూడేళ్లపాటు ఎగ్జిక్యూటివ్ బోర్డు సభ్యుడిగా ఉన్నారు. అయితే బొల్లోర్ జాగ్వార్‌కు రిజిగ్నేషన్ ఇవ్వడంతో నవంబర్ 16 నుంచి తాత్కాలిక సీఈఓగా బాధ్యతలు స్వీకరించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment