sales drop
-
‘బుల్లెట్’ బండ్లపై మోజు తగ్గిందా?
రాయల్ ఎన్ఫీల్డ్ వాహనాల అమ్మకాలు పడిపోయాయి. ఈ ఏడాది ఆగస్టులో కంపెనీ మొత్తం అమ్మకాలలో 5 శాతం తగ్గుదలని నివేదించింది. కంపెనీ గతేడాది ఆగస్టులో విక్రయించిన 77,583 యూనిట్లతో పోలిస్తే గత నెలలో 73,630 యూనిట్లను విక్రయించింది.గత ఆగస్టులో కంపెనీ దేశీయ విక్రయాలు 65,624 యూనిట్లుగా ఉన్నాయి. గతేడాది ఆగస్టులో అమ్ముడుపోయిన 69,393 యూనిట్లతో పోలిస్తే ఇవి కూడా 5 శాతం క్షీణించాయి. ఇక ఎగుమతుల విషయానికి వస్తే.. రెండు శాతం పడిపోయాయి. గత నెలలో ప్రపంచవ్యాప్తంగా 8,006 యూనిట్లు ఎగుమతి కాగా గత ఏడాది ఆగస్టులో ఎగుమతి చేసిన వాహనాలు 8,190.కస్టమర్లను ఆకర్షించి సేల్స్ పెంచుకునేందుకు కంపెనీ వివిధ ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో అత్యంత ఆదరణ ఉన్న రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 మోడల్‌కు వివిధ ఫీచర్లు జోడించి 2024 వెర్షన్‌ను ఇటీవలే విడుదల చేసింది. మోటార్‌సైకిల్ పోర్ట్‌ఫోలియో విస్తరణతో పాటు, రాయల్ ఎన్ఫీల్డ్ కొత్త రైడింగ్ గేర్లను కూడా వేగంగా విడుదల చేస్తోంది. ఇటీవల క్రాస్రోడర్స్ రైడింగ్ జాకెట్‌ను లాంచ్ చేసిన రాయల్ ఎన్ఫీల్డ్ ఇప్పుడు రాయల్ ఎన్ఫీల్డ్ ఎక్స్ రివిట్ ఆల్-వెదర్ రైడింగ్ గేర్‌ను విడుదల చేసింది. -
జాన్సన్ బేబీ పౌడర్ ఇక దొరకదు
న్యూజెర్సీ: చిన్నారుల నాజూకైన చర్మం కోసం మరింత మృదువైన పౌడర్, సౌమ్యతలోని అద్భుతం అంటూ కొన్ని దశాబ్దాల పాటు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వినియోగదారుల్ని ఆకర్షించిన అమెరికా ఫార్మా దిగ్గజం జాన్సన్ అండ్ జాన్సన్ సంచలన నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది నుంచి బేబీ టాల్కమ్ పౌడర్ అమ్మకాలను పూర్తిగా నిలిపివేస్తున్నట్టుగా ప్రకటించింది. అమెరికా, కెనడాలో 2020 నుంచి ఈ పౌడర్ విక్రయాలను నిలిపివేసిన జాన్సన్ కంపెనీ 2023 నుంచి ప్రపంచ వ్యాప్తంగా విక్రయాలను ఆపేస్తున్నట్టు స్పష్టం చేసింది. బేబీ టాల్కమ్ పౌడర్లు కేన్సర్‌కు దారి తీస్తున్నాయన్న ఆందోళనలతో జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీపై కోర్టులో 40 వేలకు పైగా పిటిషన్లు పడ్డాయి. ఈ వివాదం నేపథ్యంలో కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. టాల్కమ్ పౌడర్లలో ఉండే అస్బెస్టాస్ అనే పదార్థం వల్ల కేన్సర్ సోకుతోందంటూ ఎందరో వినియోగదారులు కోర్టులకెక్కారు. దీంతో జాన్సన్ అండ్ జాన్సన్ టాల్కమ్ పౌడర్ స్థానంలో కార్న్ స్టార్చ్ (మొక్కజొన్న పిండి)తో తయారు చేసిన పౌడర్‌ను విక్రయించనుంది. ఇప్పటికే కొన్ని దేశాల్లో ఈ కార్న్ స్టార్చ్ పౌడర్ కూడా అందుబాటులోకి వచ్చింది. అయినప్పటికీ కేన్సర్ వస్తోందంటూ న్యాయస్థానంలో పిటిషన్లు ఆగడం లేదు. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా జాన్సన్ అండ్ జాన్సన్ బేబీ టాల్కమ్ పౌడర్ విక్రయాలను నిలిపివేయాలని ఆ సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. వినియోగదారుల ఆందోళనల్ని దృష్టిలో ఉంచుకునే టాల్కమ్ పౌడర్ అమ్మకాలనే నిలిపివేస్తున్నామే తప్ప తమ పౌడర్‌లో ఎలాంటి కేన్సర్ కారకాలు లేవని వాదిస్తోంది. వివాదం ఎలా వెలుగులోకొచ్చింది ? జాన్సన్ బేబీ పౌడర్‌కున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆ పౌడర్ పూస్తే తమ బిడ్డల చర్మం మరింత మృదువుగా, పొడిగా ఉంటుందని ఎందరో తల్లులు కొన్ని దశాబ్దాలుగా వాడుతున్నారు. డైపర్లు వాడినçప్పుడు ఏర్పడే ర్యాష్‌ని కూడా ఈ పౌడర్ నిరోధించడంతో ఎంతోమంది తల్లుల మనసు దోచుకుంది. తాజాదనం కోసం పిల్లలే కాదు పెద్దలు కూడా ఈ పౌడర్ని వాడుతూ వస్తున్నారు. అందుకే కొన్ని దశాబ్దాలు ఈ పౌడర్ ఏకఛత్రాధిపత్యం కొనసాగింది. 2017లో అమెరికాలోని లాస్‌ఏంజెలిస్‌కి చెందిన మహిళ తాను సుదీర్ఘకాలం జాన్సన్ బేబీ పౌడర్ వాడడంతో ఒవేరియన్ కేన్సర్ బారిన పడ్డానంటూ కోర్టుకెక్కారు. ఈ పిటిషన్‌ను విచారించిన కోర్టు పౌడర్‌లో కేన్సర్ కారకాలు ఉన్నాయని తేలిందని స్పష్టం చేస్తూ కంపెనీకి 7 కోట్ల డాలర్లు నష్టపరిహారం కింద చెల్లించాలని తీర్పు చెప్పింది. దశాబ్దాలుగా కేన్సర్ కారకాలున్న పౌడర్ని అమ్ముతున్నందుకు మరో 34.7 కోట్ల డాలర్లను జరిమానాగా విధించింది. పౌడర్‌లో ఉండే అస్బెస్టాస్‌తో దీర్ఘకాలంలో ఊపిరితిత్తులు, అండాశయ ముఖద్వార కేన్సర్ వచ్చే అవకాశాలున్నాయని పరిశోధనలు కూడా తేల్చాయి. వాస్తవానికి 1957లో జాన్సన్ బేబీ పౌడర్‌లో అస్బెస్టాస్ ఉందని తేలింది. కానీ దీర్ఘకాలం వాడాకే దుష్ప్రభావాలు బయటపడ్డాయి. -
ఐదేళ్లలో తొలిసారిగా..! మెర్సిడెజ్ బెంజ్ స్థానం ఆ కంపెనీ కైవసం..!
2021గాను ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెజ్-బెంజ్‌కు అనూహ్యమైన పరిస్థితులు నెలకొన్నాయి. గత ఏడాదిలో వాహనాల విక్రయాల సంఖ్య గణనీయంగా పడిపోయినట్లు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా మెర్సిడెజ్ బెంజ్‌కు ఉన్న క్రేజ్‌ను 2021గాను బీఎండబ్ల్యూ సొంతం చేసుకుంది. గత ఏడాదిగాను లగ్జరీ కార్ల కేటాగిరీలో అత్యధికంగా అమ్ముడైన కార్ల బ్రాండ్‌గా బీఎండబ్ల్యూ నిలిచింది. తగ్గిన అమ్మకాలు..! ఐదేళ్ల తరువాత తొలిసారిగా ప్రపంచవ్యాప్తంగా అత్యధిక అమ్ముడైన ప్రీమియం లగ్జరీ కార్లలో బెంజ్ మొదటిస్థానాన్ని కోల్పోయింది. 2021లో ప్రపంచవ్యాప్తంగా సుమారు 2.05 మిలియన్ వాహనాలను మెర్సిడెజ్ బెంజ్ విక్రయించినట్లు తెలుస్తోంది. అదే ఏడాదిగాను సుమారు రికార్డు స్థాయిలో 2.2 మిలియన్ వాహనాల అమ్మకాలను బీఎండబ్ల్యూ జరిపింది. ప్రీమియం కార్లలో మెర్సిడెజ్-బెంజ్ స్థానాన్ని బీఎండబ్ల్యూ సొంతం చేసుకుంది. మరోవైపు అనూహ్యంగా ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాల్లో మెర్సిడెజ్ బెంజ్ 90 శాతం మేర అధికంగా అమ్మకాలను జరపడం విశేషం. ప్రపంచవ్యాప్తంగా బెంజ్ సుమారు 99,301 ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయించింది. యూరప్‌లో ప్యాసింజర్ వాహనాల అమ్మకాలలో మెర్సిడెజ్ బెంజ్ ఈ ఏడాదిగాను అతిపెద్ద పతనాన్ని చవిచూసింది. ఇది దాదాపు 11.2 శాతంగా ఉంది. ఇదిలా ఉండగా అమెరికాలో విక్రయాల్లో అతి తక్కువ వృద్ధిని మెర్సిడెస్-బెంజ్ సాధించింది. 2021గాను అమెరికాలో 0.4 శాతం పెరుగుదలను నమోదుచేసింది. బీఎండబ్ల్యూ అమ్మకాల్లో భారత్‌లో భేష్..! 2021 భారత్‌లో బీఎండబ్ల్యూ గణనీయమైన అమ్మకాలను జరిపింది. గత ఏడాదిలో మొత్తంగా 8,876 కార్లను భారత్‌లో విక్రయించినట్లు కంపెనీ పేర్కొంది. అంతేకాకుండా టూవీలర్ వాహనాల్లో 5,191 యూనిట్లను విక్రయించినట్లు బీఎండబ్ల్యూ వెల్లడించింది. టూవీలర్ వాహనాల అమ్మకాల్లో ఏకంగా 35 శాతం వృద్ధిని కంపెనీ నమోదు చేసింది. చదవండి: రేసింగ్ స్పోర్ట్స్ బైక్స్‌లో సంచలనం..! అందులోనూ ఎలక్ట్రిక్ బైక్..! ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఏకంగా 235 కి.మీ..! -
తగ్గిన మొబైల్ ఫోన్ల అమ్మకాలు
న్యూఢిల్లీ: ప్రపంచంలో మొబైల్ ఫోన్ల విక్రయాల్లో భారత్‌ది ప్రముఖ స్థానం. మొబైల్ ఫోన్ల ఉత్పత్తిదారులకు భారత్ అది పెద్ద మార్కెట్. కాగా గత 20 ఏళ్లలో భారతీయ మొబైల్ ఫోన్ల అమ్మకాలు తొలిసారి పడిపోవడం ఆశ్చర్యకరం. గత జనవరి నుంచి మార్చి వరకు 14.5 శాతం మేర విక్రయాలు తగ్గాయి. గతేడాది చివరి మూడు నెలల్లో 6.2 కోట్ల మొబైల్ విక్రయాలు జరగగా, ఈ ఏడాది తొలి మూడు నెలల్లో ఆ సంఖ్యం 5.3 కోట్లకు తగ్గింది.