
న్యూఢిల్లీ: రాయల్ ఎన్‌ఫీల్డ్ అడ్వెంచర్ టూరింగ్ మోడల్ ‘హిమాలయన్’లో కొత్త వెర్షన్ ‘స్లీట్’ను ఆవిష్కరించింది. దీని ప్రారంభ ధర రూ.2.13 లక్షలు (ఆన్–రోడ్ చెన్నై). తొలి 500 వాహనాలకు కంపెనీయే ఎక్స్‌ప్లోరర్ కిట్‌ను అందిస్తోంది. ఈ బైక్‌పై ఆసక్తి ఉన్నవారు జనవరి 12 నుంచి 30 వరకు కంపెనీ వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాలి. విక్రయాలు జనవరి 30న ప్రారంభమౌతాయి’ అని కంపెనీ తెలియజేసింది.