వెబ్‌డెస్క్ : రౌడీ హీరో విజయ్ దేవరకొండ యాట్యిట్యూడ్‌కు పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. పెళ్లి చూపుల్లో అమాయకంగా కనిపించిన విజయ్ దేవరకొండ ఆ తర్వాత వచ్చిన అర్జున్‌రెడ్డిలో నట విశ్వరూపమే చూపించాడు. ఎంతో మంది అభిమానాన్ని సంపాదించుకున్నారు. గీతగోవిందంలో భయస్తుడిలా కనిపించినా.. డియర్ కామ్రేడ్‌లో ఆవేశపరుడిగా మెప్పించాడు విజయ్.
వింటేజ్ టూ విదేశీ
పాత్ర ఏదైనా సరే తన ప్రతీ సినిమాలో యూత్‌ని ఎట్రాక్ట్ చేసే బైక్స్ వాడేస్తుంటాడు విజయ్ దేవరకొండ. వింటేజ్ నుంచి విదేశీ భైకుల వరకు తన సినిమాలో బైక్‌లకు ప్రత్యేక స్థానాన్ని కేటాయిస్తాడు. నెక్ట్స్ సినిమాలో విజయ్ ఏ బైక్ యూజ్ చేస్తాడా అని అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తుంటారు. తాజాగా బాలీవుడ్ ఏస్ వన్ ఫోటోగ్రాఫర్ దబు రత్నానీ ఫోటోషూట్‌లో ట్రంఫ్ బైక్‌తో కనిపించారు విజయ్ దేవరకొండ. ఇప్పటి వరకు విజయ్ చిత్రాల్లో రైడ్ చేసిన బైకులు.. వాటి ధరల ఎంతో చూద్దాం (ఎక్స్‌షోరూం)
Yezdi 300, ధర రూ. 1.6 లక్షలు
సుజికీ యాక్సెస్, ధర రూ. 74 వేలు
రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ ధర రూ. 1.6 లక్షలు
సీబీజెడ్ ఎక్స్‌ట్రీం ధర రూ. 81 వేలు
రాయల్‌ఎన్‌ఫీల్డ్ కాంటినెంటల్ జీటీ రూ. 2.5 లక్షలు
బొనవిల్లే స్పీడ్‌మాస్టర్ ట్రయంఫ్ రూ. 11.75 లక్షలు
యమహా వైజెడ్ డర్ట్ బైక్ ధర రూ. 4 లక్షలు
బీఎస్‌ఏ గోల్డ్‌స్టార్ ధర 2,000 యూరోలు
బీఎండబ్ల్యూ జీ 310 ధర రూ. 2.90 లక్షలు
బజాజ్ చేతక్ ధర రూ. 23,000
చదవండి : ఆడి నుంచి ఈ - ట్రోన్ ఎస్‌యూవీ
Comments
Please login to add a commentAdd a comment