
న్యూఢిల్లీ: దేశీ దిగ్గజ ద్విచక్ర వాహన తయారీ కంపెనీ ‘హీరో మోటోకార్ప్’ తాజాగా మూడు కొత్త బైక్‌లను మార్కెట్‌లో ఆవిష్కరించింది. 125 సీసీ ఇంజిన్ సామర్థ్యంతో ‘సూపర్ స్లె్పండర్’ను, 110 సీసీ ఇంజిన్ సామర్థ్యంతో ‘ప్యాషన్ ప్రో’ను, 110 సీసీ ఇంజిన్ సామర్థ్యంతో ‘ప్యాషన్ ఎక్స్‌ప్రొ’ను తీసుకువచ్చింది. ఈ బైక్స్‌ను అధునాతన ఫీచర్లతో ఆకట్టుకునే డిజైన్‌తో రూపొందించామని, వీటి సాయంతో దేశీ మోటార్‌సైకిల్ విభాగంలో తమ స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంటామని కంపెనీ తెలియజేసింది.
కాగా 100–125 సీసీ విభాగంలో హీరో కంపెనీదే హవా. ఇందులో స్లె్పండర్, ప్యాషన్, హెచ్‌ఎఫ్ డీలక్స్, గ్లామర్, సూపర్ స్లె్పండర్ వంటి బ్రాండ్లతో దూసుకుపోతోంది. కంపెనీ ఈ కొత్త మోడళ్ల ధరలను త్వరలో ప్రకటించనుంది.
Comments
Please login to add a commentAdd a comment