యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్యకు బైకులంటే ఆసక్తి ఎక్కువ. చైతో పాటు అఖిల్‌కు కూడా స్పోర్ట్స్ బైకులు, స్పోర్ట్స్ కార్లన్నా బాగా ఇష్టం. కొత్తగా మార్కెట్లోకి వచ్చిన బైకు వీరి మనసు దోచిందంటే చాలు ఆ వెంటనే ఇంటి ముందుండేలా చూసుకుంటారు. ఈ క్రమంలో చై దగ్గర లగ్జరీ బైకులు, కార్ల కలెక్షన్ బాగానే ఉంది. మరి అతడి దగ్గరున్న ఆ ఖరీదైన వాహనాలేంటో? వాటి ఖరీదెంతో చూసేద్దాం..
1. BMWR9T: నాగచైతన్య దగ్గరున్న ఖరీదైన బైకుల్లో ఇది ఒకటి. 2014లో లాంచ్ అయిన ఈ బైక్‌ను చై రూ.19 లక్షలు గుమ్మరించి మరీ తన సొంతం చేసుకున్నాడు. దీని మీద భార్య సమంతను ఎక్కించుకుని మరీ రోడ్ల మీద చక్కర్లు కొట్టాడు.
2. Triumph Thruxton R bike: ఈ రేసర్ బైక్ అంటే కూడా చైకు చాలా ఇష్టం. ఇంతకీ దీని ధరెంతనుకుంటున్నారు. మార్కెట్‌లో దీని వాల్యూ ఇంచుమించు రూ.13 లక్షలుగా ఉందట.
3. Ferrari F 430: ఈ కారుకు చై మాత్రమే కాదు జాన్‌సేన నుంచి మొదలు పెడితే బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ వరకు ఎందరో ఫ్యాన్స్ ఉన్నారు. ఈ కారు ధర రూ.1.75 కోట్లుగా ఉంది.
4. Mercedes Benz G-Class G63: రణ్‌బీర్ కపూర్, హార్దిక్ పాండ్యాల, రామ్ చరణ్‌లతో పాటు చైతన్య కూడా ఈ మెర్సిడిస్ బెంజ్ కారుకు ఓనరే. దీని ఖరీదు సుమారు కోటి రూపాయలు ఉంటుందట.
5. MV Agusta F4: చైతూ ఫేవరెట్ కార్లలో అగస్ట కారుది ప్రత్యేక స్థానం. రూ.26 నుంచి రూ.35 లక్షల మధ్య ఉండే ఈ కారులో ఈ అక్కినేని హీరో చాలా సార్లు షికార్లు చేస్తూ మీడియా కంట పడ్డాడు. ఈ లగ్జరీ వాహనాలతో పాటు యమహా వైజెడ్ఎఫ్ ఆర్1 స్పోర్ట్స్ బైక్, హోండా స్పోర్ట్స్ బైక్ సహా మరిన్ని చై గ్యారేజీలో ఉన్నట్లు తెలుస్తోంది.
చదవండి: నాగచైతన్య 'వార్' వాయిదా!
Comments
Please login to add a commentAdd a comment