MS Dhoni Buys Vintage Land Rover Series 3 Car - Sakshi
Sakshi News home page

ధోనీ గ్యారేజీలోకి మరో అరుదైన కారు.. కారు స్పెషల్ ఇదే!

Published Wed, Jan 19 2022 7:52 PM | Last Updated on Wed, Jan 19 2022 8:07 PM

Indian Cricketer MS Dhoni buys a Vintage Land Rover Series 3 Car - Sakshi

టీమిండియా మాజీ కెప్టెన్​ మహేంద్ర సింగ్​ ధోనీకి బైక్​, కార్లు అంటే ఇష్టం అనే సంగతి మన అందరికీ తెలిసిందే. తన గ్యారేజీ​లోకి అడుగుపెడితే ఎన్నో రక రకాల వాహనాలు దర్శమిస్తాయి. తాజాగా ధోనీ గ్యారేజీ​లోకి మరో కారు వచ్చి చేరింది. ఎంఎస్ ధోని తన కోసం వింటేజ్ క్లాసిక్ ల్యాండ్ రోవర్ 3 కారును కొనుగోలు చేశాడు. బిగ్ బాయ్ టాయ్జ్ అనే సంస్థ నిర్వహించిన ఆన్‌లైన్‌ వేలంలో పాల్గొని ఇతరులతో పోటీ పడీ మరీ ఈ కారును ధోనీ దక్కించుకున్నాడు. 
 
ఆ కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ వేలంలో భారతదేశం నలుమూలల నుంచి అనేక మంది ప్రముఖులు ఈ వేలంలో పాల్గొన్నారు. బిగ్ బాయ్ టాయ్జ్ అనే సంస్థ రోల్స్ రాయిస్, కాడిలాక్, బ్యూక్, చేవ్రొలెట్, ల్యాండ్ రోవర్, ఆస్టిన్, మెర్సిడెస్ బెంజ్ వంటి 19 రకాల కార్లను వేలంలో ఉంచింది. ఇందులో ధోనీ 1970 మోడల్‌ ల్యాండ్ రోవర్‌ 3 కారును రూ.25 లక్షలు చెల్లించి సొంతం చేసుకున్నాడు. ఈ ల్యాండ్ రోవర్‌ కారుకు ఆటోమొబైల్‌ రంగంలో ప్రత్యేక స్థానం ఉంది. 1970 దశకం నుంచి 1980 మధ్య కాలం వరకు దీన్ని తయారు చేసేవారు. 2.25 లీటర్ల ఇంజిన్‌ సామర్థ్యం గల ఈ కారు మ్యానువల్ ట్రాన్స్‌మిషన్‌తో నడుస్తుంది. ఆన్‌లైన్‌ వేలంలో వేలానికి ఉంచిన వాహనాల్లో 50 శాతం విక్రయించినట్లు బీబీటీ పేర్కొంది.

(చదవండి: కోహ్లితో బవుమా గొడవ.. ఏం జరిగింది?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement