సాక్షి, న్యూఢిల్లీ: దేశీయ అతి పెద్ద ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ హీరో మోటో కార్ప్ బుధవారం మూడు కొత్త బైక్‌లను ఆవిష్కరించింది. ప్రీమియం బైక్స్ సెగ్మెంట్‌లో వీటిని లాంచ్ చేసింది. ప్లస్ 200,ప్లస్ 200టీ, ఎక్స్‌ట్రీం 200ఎస్ పేరుతో వీటిని భారత మార్కెట్లో ప్రవేశ పెట్టింది. దీంతో ఎక్స్ సిరీస్‌లో ఇప్పటివరకూ నాలుగు మోడల్స్ విడుదల చేసినట్లయింది. వీటి ధరలు రూ.94 వేల నుంచి రూ.1.05 లక్షల (న్యూఢిల్లీ ఎక్స్ షోరూం ధరలు) మధ్య ఉండనున్నాయి.
200సీసీ ఎక్స్ పల్స్ 200టీ ధర రూ.94 వేలు.
ఎక్స్ ప్లస్ 200 ధర రూ.97 వేలు
ఫ్యుయల్ ఇంజెక్షన్ బైక్ మోడల్ ధర రూ.1.05 లక్షలు
ఎక్స్‌ట్రీమ్ 200ఎస్ ధర రూ.98,500గా నిర్ణయించింది.
ప్రీ బుకింగ్, రీటైల్ తదితర వివరాలను మరికొన్ని వారాల్లో వెల్లడిస్తామని హీరో తెలిపింది. ఈ సందర్భంగా హీరో మోటోకార్ప్ సేల్స్ చీఫ్ సంజయ్ భాన్ మాట్లాడుతూ.. ప్రీమియం బైక్ సెగ్మెంట్‌లో తమ ఉనికిని నెమ్మదిగా పెంచుతున్నామనీ, ఇది దీర్ఘకాలిక ప్రణాళిక. రాబోయే మూడు లేదా నాలుగేళ్లలో ప్రీమియం బైక్‌ల సెగ్మెంట్‌లో టాప్ ప్లేస్‌లో ఉండే లక్ష్యంతో పని చేస్తున్నామని తెలిపారు. త్వరలో 400 - 450 సీసీ బైక్‌ల సెగ్మెంట్‌లోనూ ప్రవేశించనున్నామని భాన్ వెల్లడించారు.
కాగా 150 సీసీ బైక్‌ల సెగ్మెంట్‌లో మొదటి స్థానంలో ఉన్న హీరో మోటో2017, 2018 ఈఐసీఎంఏషోలో 200 సీసీ విభాగంలో ఎక్స్‌పల్స్ 200, ఎక్స్‌పల్స్ 200టీ బైక్స్‌ను పరిచేయం చేసిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment