Hero motocarp company
-
పబ్లిక్ ఇష్యూ ద్వారా హీరో ఫిన్‌కార్ప్ రూ.4వేల కోట్లు సమీకరణ!
ప్రముఖ దిగ్గజ కంపెనీ హిరో మోటోకార్ప్ ఆటోమోబైల్ రంగంలో సేవలు అందించడంతో పాటు ఫైనాన్స్ రంగంలోనూ తన సత్తాచాటేందుకు సిద్ధం అయింది. హీరో మోటోకార్ప్ ఆర్థిక సేవల విభాగమైన హీరో ఫిన్‌కార్ప్ రూ.4,000 కోట్ల సమీకరణ లక్ష్యంతో 2024లో పబ్లిక్ ఇష్యూకు వచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. పబ్లిక్ ఇష్యూపై సలహాలు ఇచ్చేందుకు ఎనిమిది ఇన్వెస్ట్మెంట్ బ్యాంకులను సంస్థ ఎంపిక చేసినట్లు సమాచారం. ఇన్వెస్ట్మెంట్ బ్యాంకుల్లో జేఎం ఫైనాన్షియల్, బ్యాంక్ ఆఫ్ అమెరికా సెక్యూరిటీస్, జెఫ్రీస్, ఐసీఐసీఐ సెక్యూరిటీస్, హెచ్ఎస్బీసీ సెక్యూరిటీస్, యూబీఎస్, ఎస్బీఐ కేపిటల్, హెచ్డీఎఫ్సీ ఉన్నాయని ఓ వార్త మీడియాలో ప్రచురించారు. ప్రతిపాదిత ఐపీఓలో భాగంగా కొత్త షేర్ల జారీ, ప్రస్తుత వాటాదార్ల షేర్ల విక్రయం ద్వారా రూ.4,000 కోట్లను సమీకరించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. హీరో ఫిన్‌కార్ప్‌లో హీరోమోటో కార్ప్ సంస్థకు 40 శాతం వాటా ఉంది. ముంజల్ కుటుంబం చేతిలో 35-39 శాతం వాటా ఉండగా.. అపోలో గ్లోబల్, క్రిస్ కేపిటల్, క్రెడిట్ సూయిజ్, హీరో మోటోకార్ప్‌నకు చెందిన కొన్ని డీలర్ల సంస్థల వద్ద మిగిలిన వాటా ఉంది. 1991లో హీరో ఫిన్‌కార్ప్ బ్యాంకింగేతర ఆర్థిక సేవల కంపెనీగా ఏర్పడింది. -
హీరో బైక్స్ లాంచ్
సాక్షి, న్యూఢిల్లీ: దేశీయ అతి పెద్ద ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ హీరో మోటో కార్ప్ బుధవారం మూడు కొత్త బైక్‌లను ఆవిష్కరించింది. ప్రీమియం బైక్స్ సెగ్మెంట్లో వీటిని లాంచ్ చేసింది. ప్లస్ 200,ప్లస్ 200టీ, ఎక్స్ట్రీం 200ఎస్ పేరుతో వీటిని భారత మార్కెట్లో ప్రవేశ పెట్టింది. దీంతో ఎక్స్ సిరీస్‌లో ఇప్పటివరకూ నాలుగు మోడల్స్ విడుదల చేసినట్లయింది. వీటి ధరలు రూ.94 వేల నుంచి రూ.1.05 లక్షల (న్యూఢిల్లీ ఎక్స్ షోరూం ధరలు) మధ్య ఉండనున్నాయి. 200సీసీ ఎక్స్ పల్స్ 200టీ ధర రూ.94 వేలు. ఎక్స్ ప్లస్ 200 ధర రూ.97 వేలు ఫ్యుయల్ ఇంజెక్షన్ బైక్ మోడల్ ధర రూ.1.05 లక్షలు ఎక్స్ట్రీమ్ 200ఎస్ ధర రూ.98,500గా నిర్ణయించింది. ప్రీ బుకింగ్, రీటైల్ తదితర వివరాలను మరికొన్ని వారాల్లో వెల్లడిస్తామని హీరో తెలిపింది. ఈ సందర్భంగా హీరో మోటోకార్ప్ సేల్స్ చీఫ్ సంజయ్ భాన్ మాట్లాడుతూ.. ప్రీమియం బైక్ సెగ్మెంట్లో తమ ఉనికిని నెమ్మదిగా పెంచుతున్నామనీ, ఇది దీర్ఘకాలిక ప్రణాళిక. రాబోయే మూడు లేదా నాలుగేళ్లలో ప్రీమియం బైక్‌ల సెగ్మెంట్లో టాప్ ప్లేస్‌లో ఉండే లక్ష్యంతో పని చేస్తున్నామని తెలిపారు. త్వరలో 400 - 450 సీసీ బైక్‌ల సెగ్మెంట్లోనూ ప్రవేశించనున్నామని భాన్ వెల్లడించారు. కాగా 150 సీసీ బైక్‌ల సెగ్మెంట్లో మొదటి స్థానంలో ఉన్న హీరో మోటో2017, 2018 ఈఐసీఎంఏషోలో 200 సీసీ విభాగంలో ఎక్స్‌పల్స్ 200, ఎక్స్‌పల్స్ 200టీ బైక్స్‌ను పరిచేయం చేసిన సంగతి తెలిసిందే. -
హీరో.. రెండు కొత్త 100 సీసీ బైక్‌లు
* స్ప్లెండర్ ప్రొ క్లాసిక్ ధర రూ. 48,650 * ప్యాషన్ ప్రొ టీఆర్ ధర రూ. 51,500 న్యూఢిల్లీ: హీరో మోటొకార్ప్ కంపెనీ 100 సీసీ కేటగిరీలో రెండు కొత్త బైక్‌లను బుధవారం మార్కెట్లోకి తెచ్చింది. దీపావళి పండుగ సందర్భంగా స్ప్లెండర్ ప్రొ క్లాసిక్(ధర రూ. 48,650), ప్యాషన్ ప్రొ టీఆర్(రూ. 51,550-రెండూ ఎక్స్ షోరూమ్ ధరలు) ఈ రెండు బైక్‌లను అందిస్తున్నామని వివరించింది. స్ప్లెండర్ ప్రొ క్లాసిక్ అనేది కేఫ్ రైడర్ బైక్ కాగా, ప్యాషన్ ప్రొ టీఆర్ అనేది ఆఫ్-రోడ్ బైక్. ఈ రెండు బైక్‌లు ఆయా కేటగిరీల్లో తొలి బైకులు కావడం విశేషం. తొలి 100 సీసీ కేఫ్ రేసర్ బైక్... స్ప్లెండర్ ప్రొ క్లాసిక్ అనేది 100 సీసీ కేటగిరీలో వస్తోన్న తొలి చౌకైన కేఫ్ రేసర్ బైక్. కేఫ్ రేసర్ బైక్‌ల్లో సౌకర్యం కన్నా కూడా వేగానికి, హ్యాం డ్లింగ్కు ప్రాధాన్యత ఇస్తారు. బైక్ వేగంగా నడవడానికి, హ్యాండ్లింగ్ కోసం తేలికగా ఉండేలా, తక్కువ పవర్‌తో కేఫ్ రేసర్ బైక్‌లను రూపొందిస్తారు. స్ప్లెండర్ ప్రొ క్లాసిక్ బైక్‌లో ఎయిర్-కూల్డ్ ఫోర్-స్ట్రోక్ సింగిల్ సిలిండర్ ఓహెచ్సీ ఇంజిన్, క్లాసిక్ సింగిల్ సీట్, వింటేజ్ స్టైల్ కేఫ్ కౌల్, స్పోర్టీ హ్యాండిల్ బార్, గుండ్రంగా ఉండే స్పీడో మీటర్, వైర్ స్పోక్ వీల్స్ వంటి ప్రత్యేకతలున్నాయని హీరో మోటో పేర్కొంది. తొలి 100 సీసీ ఆఫ్-రోడ్ బైక్... ప్యాషన్ ప్రొ టీఆర్... 100 సీసీ కేటగిరీలో తొలి ఆఫ్-రోడ్ బైక్ ఇది. బురద, కచ్చా రోడ్లు, మట్టి రోడ్లు, పర్వత మార్గాల్లో ఇతర 100 సీసీ బైక్‌ల కన్నా ఈ ఆఫ్ రోడ్ బైక్‌ను ఉత్తమంగా నడపవచ్చని అంచనా. ఇది బడ్జెట్ అడ్వెంచర్ మోటార్ సైకిల్ అని నిపుణులంటున్నారు. క్రాస్ బ్రేస్‌తో కూడిన పటిష్టమైన హ్యాండిల్ బార్స్, మంచి గ్రిప్ కోసం నీ ప్యాడ్, హ్యాండ్ గార్డ్స్, మంచి రోడ్ గ్రిప్ కోసం స్పెషల్ టైర్ ట్రెడ్తో కూడిన డ్యుయల్ స్పోర్ట్ టైర్లు, , ఫ్యూయల్ టాంక్ ప్యాడ్స్, డిజైనర్ నకల్ గార్డ్, ఎయిర్-కూల్డ్ ఫోర్-స్ట్రోక్ సింగిల్ సిలిండర్ ఓహెచ్సీ ఇంజిన్ వంటి ప్రత్యేకతలున్నాయి.