హీరో.. రెండు కొత్త 100 సీసీ బైక్‌లు | Hero MotoCorp revs up for festive season with two 100cc bikes, one with café racer styling! | Sakshi
Sakshi News home page

హీరో.. రెండు కొత్త 100 సీసీ బైక్‌లు

Published Thu, Oct 9 2014 1:05 AM | Last Updated on Sat, Sep 2 2017 2:32 PM

హీరో.. రెండు కొత్త 100 సీసీ బైక్‌లు

హీరో.. రెండు కొత్త 100 సీసీ బైక్‌లు

* స్ప్లెండర్ ప్రొ క్లాసిక్ ధర రూ. 48,650
* ప్యాషన్ ప్రొ టీఆర్ ధర రూ. 51,500
న్యూఢిల్లీ: హీరో మోటొకార్ప్ కంపెనీ 100 సీసీ కేటగిరీలో రెండు కొత్త బైక్‌లను బుధవారం మార్కెట్లోకి తెచ్చింది.  దీపావళి పండుగ సందర్భంగా  స్ప్లెండర్ ప్రొ క్లాసిక్(ధర రూ. 48,650), ప్యాషన్ ప్రొ టీఆర్(రూ. 51,550-రెండూ ఎక్స్ షోరూమ్ ధరలు) ఈ రెండు బైక్‌లను అందిస్తున్నామని వివరించింది.  స్ప్లెండర్ ప్రొ క్లాసిక్ అనేది  కేఫ్ రైడర్ బైక్ కాగా, ప్యాషన్ ప్రొ టీఆర్ అనేది ఆఫ్-రోడ్ బైక్. ఈ రెండు బైక్‌లు ఆయా కేటగిరీల్లో తొలి బైకులు కావడం విశేషం.
 
తొలి 100 సీసీ కేఫ్ రేసర్ బైక్...
స్ప్లెండర్ ప్రొ క్లాసిక్ అనేది 100 సీసీ కేటగిరీలో వస్తోన్న తొలి చౌకైన కేఫ్ రేసర్ బైక్.  కేఫ్ రేసర్ బైక్‌ల్లో సౌకర్యం కన్నా కూడా వేగానికి, హ్యాం డ్లింగ్‌కు ప్రాధాన్యత ఇస్తారు.  బైక్ వేగంగా నడవడానికి, హ్యాండ్లింగ్ కోసం తేలికగా ఉండేలా, తక్కువ పవర్‌తో కేఫ్ రేసర్ బైక్‌లను రూపొందిస్తారు. స్ప్లెండర్ ప్రొ క్లాసిక్  బైక్‌లో ఎయిర్-కూల్డ్ ఫోర్-స్ట్రోక్ సింగిల్ సిలిండర్ ఓహెచ్‌సీ ఇంజిన్, క్లాసిక్ సింగిల్ సీట్, వింటేజ్ స్టైల్ కేఫ్ కౌల్, స్పోర్టీ హ్యాండిల్ బార్, గుండ్రంగా ఉండే స్పీడో మీటర్, వైర్ స్పోక్ వీల్స్ వంటి ప్రత్యేకతలున్నాయని హీరో మోటో పేర్కొంది.
 
తొలి 100 సీసీ ఆఫ్-రోడ్ బైక్...

ప్యాషన్ ప్రొ టీఆర్... 100 సీసీ కేటగిరీలో తొలి ఆఫ్-రోడ్ బైక్ ఇది. బురద, కచ్చా రోడ్లు, మట్టి రోడ్లు,  పర్వత మార్గాల్లో ఇతర 100 సీసీ బైక్‌ల కన్నా ఈ ఆఫ్ రోడ్ బైక్‌ను ఉత్తమంగా నడపవచ్చని అంచనా. ఇది బడ్జెట్ అడ్వెంచర్ మోటార్ సైకిల్ అని నిపుణులంటున్నారు. క్రాస్ బ్రేస్‌తో కూడిన పటిష్టమైన హ్యాండిల్ బార్స్, మంచి గ్రిప్ కోసం నీ ప్యాడ్,  హ్యాండ్ గార్డ్స్, మంచి రోడ్ గ్రిప్ కోసం స్పెషల్ టైర్ ట్రెడ్‌తో కూడిన డ్యుయల్ స్పోర్ట్ టైర్లు, , ఫ్యూయల్ టాంక్ ప్యాడ్స్, డిజైనర్ నకల్ గార్డ్, ఎయిర్-కూల్డ్ ఫోర్-స్ట్రోక్ సింగిల్ సిలిండర్ ఓహెచ్‌సీ ఇంజిన్ వంటి ప్రత్యేకతలున్నాయి.

 

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement