బజాజ్ అడ్వెంచ ర్ స్పోర్ట్... కొత్త వేరియంట్లు | Bajaj Auto Plans Capacity Expansion as Pulsar Demand Regains Strength | Sakshi
Sakshi News home page

బజాజ్ అడ్వెంచ ర్ స్పోర్ట్... కొత్త వేరియంట్లు

Published Sat, Jun 13 2015 12:28 AM | Last Updated on Sun, Sep 3 2017 3:38 AM

బజాజ్ అడ్వెంచ ర్ స్పోర్ట్...  కొత్త వేరియంట్లు

బజాజ్ అడ్వెంచ ర్ స్పోర్ట్... కొత్త వేరియంట్లు

హైదరాబాద్: ప్రముఖ వాహన తయారీ సంస్థ బజాజ్ తన పల్సర్ అడ్వెంచర్ స్పోర్ట్ సిరీస్‌లో రెండు కొత్త వేరియంట్లను మార్కెట్‌లోకి విడుదల చేసింది. ప్రధానంగా యువతను టార్గెట్ చేస్తూ, సరికొత్త డిజైన్‌తో ‘పల్సర్ ఏఎస్ 200’, ‘పల్సర్ ఏఎస్ 150’ అనే వేరియంట్లను రూపొందించింది. ‘ఏఎస్ 200’ వేరియంట్‌లో 4 వాల్వ్ 200సీసీ డీటీఎస్-ఐ ఇంజిన్, లిక్విడ్ కూలింగ్ సిస్టమ్, 6-స్పీడ్ ట్రాన్స్‌మిషన్ గేర్‌బాక్స్, ట్రిపుల్ స్పార్క్ టెక్నాలజీ, సుపీరియర్ బ్రేకింగ్, నైట్రక్స్ మోనో సస్‌పెన్షన్ తదితర ప్రత్యేకతలు ఉన్నాయి. దీని ధర రూ.92,500 (ఎక్స్ షోరూమ్ ఢిల్లీ). అలాగే ‘ఏఎస్ 150’ వేరియంట్‌లో 4 వాల్వ్ 149.5సీసీ డీటీఎస్-ఐ ఇంజిన్, ట్విన్ స్పార్క్ టెక్నాలజీ, 5-స్పీడ్ ట్రాన్స్‌మిషన్ గేర్‌బాక్స్, ఎయిర్ కూలింగ్ సిస్టమ్ వంటి ప్రత్యేకతలు ఉన్నాయి. దీని ధర రూ.79,000 (ఎక్స్ షోరూమ్ ఢిల్లీ).

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement