పల్సర్‌ 150లో కొత్త వేరియంట్‌ | Bajaj Pulsar 150 Release in Indian Market | Sakshi
Sakshi News home page

పల్సర్‌ 150లో కొత్త వేరియంట్‌

Published Fri, Nov 30 2018 11:05 AM | Last Updated on Fri, Nov 30 2018 11:05 AM

Bajaj Pulsar 150 Release in Indian Market - Sakshi

న్యూఢిల్లీ: బజాజ్‌ ఆటో కంపెనీ పల్సర్‌ 150 సీసీ కేటగిరీలో కొత్త వేరియంట్‌ను మార్కెట్లోకి తెచ్చింది. పల్సర్‌ 150 నియాన్‌ పేరుతో అందిస్తున్న బైక్‌ ధర రూ.64,998గా (ఎక్స్‌షోరూమ్, ఢిల్లీ) నిర్ణయించామని బజాజ్‌ ఆటో తెలిపింది. 100–110 సీసీ బైక్‌లను మించిన పనితీరు కావాలనుకునే వినియోగదారులు లక్ష్యంగా ఈ కొత్త పల్సర్‌ 150 నియాన్‌ను తెస్తున్నామని కంపెనీ మోటార్‌ సైకిల్స్‌ విభాగం ప్రెసిడెండ్‌ ఎరిక్‌ వాస్‌ పేర్కొన్నారు.  100/110 సీసీ కంటే ఎక్కువ ఇంజిన్‌ సామర్థ్యం ఉన్న బైక్‌ కొనాలనుకునే వారికి తొలి ఎంపిక ఇదే అవుతుందన్నారు. ఈ బైక్‌ను 4–స్ట్రోక్, 2– వాల్వ్, ట్విన్‌ స్పార్క్, ఎయిర్‌ కూల్డ్‌ డీటీఎస్‌–ఐ ఇంజిన్‌తో రూపొందించామని, 5 గేర్లు, ముందు భాగంలో 240 ఎమ్‌ఎమ్‌ డిస్క్‌ బ్రేక్, వెనక భాగంలో 130 సీసీ డ్రమ్‌ బ్రేక్‌లున్నాయని     వివరించారు. ఈ బైక్‌...హోండా సీబీ యూనికార్న్‌ 150, హీరో అచీవర్‌ 150, యమహా ఎస్‌జడ్‌–ఆర్‌ఆర్‌ తదితర బైక్‌లకు గట్టిపోటీనిస్తుందని పరిశ్రమ వర్గాలంటున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement