pulsar
-
సరికొత్త ఫీచర్లతో బజాజ్ పల్సర్ ఎన్ఎస్ సిరీస్
హైదరాబాద్: బజాజ్ ఆటో తన పల్సర్ ఎన్ఎస్ నేకెడ్ స్ట్రీట్‌ఫైటర్ లైన్‌కు అప్డేట్ వెర్షన్‌ను విడుదల చేసింది. ఈ సిరీస్‌లోని ఎన్ఎస్ 160, ఎన్ఎస్ 200 మోడళ్లను సరికొత్త ఫీచర్లతో తీసుకొచ్చింది. వీటి ధరలు వరుసగా రూ.1.35 లక్షలు.., రూ.1.47 లక్షలుగా ఉన్నాయి. మంచి హ్యాండ్లింగ్ కోసం యూఎస్డీ ఫ్రంట్ ఫోర్క్‌లు, మెరుగైన భద్రతకు డ్యూయల్ చానల్ ఏబీఎస్ను అమర్చారు. ఇన్ఫినిటీ డిస్ప్లే కొత్త పల్సర్లలో ప్రత్యేకం. డిస్ప్లే కన్సోల్‌లో ఇప్పుడు గేర్ పొజిషన్ ఇండికేటర్ కూడా ఉంది. ఎన్ఎస్ 200 మోడల్ 18.75 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో జత చేశారు. ఎన్ఎస్ 160 మోడల్ 14.6 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. బజాజ్ పల్సర్ పల్సర్ ఎన్ఎస్ 160, ఎన్ఎస్ 200లు మెటాలిక్ పెరల్ వైట్, గ్లోసీ ఎబోనీ బ్లాక్, శాటిన్ రెడ్ , ప్యూటర్ గ్రే రంగులలో లభ్యం. -
పల్సర్ బైక్‌లే టార్గెట్.. ఫంక్షన్‌కు వెళ్లినప్పుడు ఏర్పడిన పరిచయం..
ఎమ్మిగనూరు రూరల్: బళ్లారి కౌల్ బజార్ ప్రాంతంలో పల్సర్ బైక్‌లే టార్గెట్‌గా చోరీలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గోనెగండ్ల మండలం హెచ్.కైరవాడికి చెందిన హమన్, కడిమెట్లకు చెందిన మహేష్, శంకర్, విక్కిని నుంచి 30 పల్సర్ బైక్‌లు స్వాధీనం చేసుకున్నారు. గత నెలలో ఓ రిటైర్డ్ ఏఎస్ఐ బైక్ చోరీకి గురైంది. బళ్లారి కౌల్ బజార్ పోలీసులు బళ్లారిలో వివిధ కేసుల్లో నిందితుడిగా ఉన్న అబ్దుల్‌ను అనుమానంతో అదుపులో తీసుకుకొని విచారణ చేపట్టగా బైక్ చోరీల వ్యవహారం వెలుగు చూసింది. కై రవాడికి చెందిన హమన్ బళ్లారిలో ఓ ఫంక్షన్‌కు వెళ్లినప్పుడు అబ్దుల్‌తో పరిచయం ఏర్పడింది. అబ్దుల్ బైక్‌లను చోరీ చేసి హమన్‌కు అప్పగించే వాడు. హమన్...కడిమెట్లకు చెందిన మహేష్, శంకర్, విక్కితో కలిసి బైక్‌లను కేవలం రూ.15 వేల నుంచి రూ.20 వేల లోపు విక్రయించే వారు. ఆ బైక్‌లను కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ప్రాంతంలో విక్రయించినట్లు సమాచారం ఇవ్వడంతో కౌలుబజార్ ఎస్ఐ శివకుమార్‌నాయక్ ఎమ్మిగనూరులో మకాం వేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. గోనెగండ్ల పోలీస్టేషన్ పరిధిలో 19, ఎమ్మిగనూరు రూరల్ స్టేషన్ పరిధిలో 11 బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను బళ్లారికి తరలించారు. చదవండి: వ్యవసాయ అధికారి వంచన.. పెళ్లి చేసుకుంటానని మహిళను నమ్మించి -
అంతా యూట్యూబ్ మహిమ.. ఓన్లీ స్పోర్ట్స్ బైక్స్‌యే సుమీ..!
సాక్షి, హైదరాబాద్: పార్కింగ్ వసతి లేని హాస్టళ్ల బయట పార్క్ చేసిన పల్సర్ కంపెనీ స్పోర్ట్స్ బైక్స్‌ను టార్గెట్‌గా చేసుకుని వరుస చోరీలకు పాల్పడిన అంతర్రాష్ట్ర ముఠాకు ఆసిఫ్‌నగర్ పోలీసులు చెక్ పెట్టారు. ఈ గ్యాంగ్ కేవలం 12 రోజుల వ్యవధిలో ఎనిమిది వాహనాలను తస్కరించినట్లు పశ్చిమ మండల సంయుక్త పోలీసు కమిషనర్ ఏఆర్ శ్రీనివాస్ పేర్కొన్నారు. ఆసిఫ్‌నగర్ ఏసీపీ ఆర్జీ శివమారుతి, ఇన్స్పెక్టర్ ఎన్.రవీందర్‌తో కలిసి సోమవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పూర్తి వివరాలు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా పిడుగురాళ్ల, నరసరావుపేట ప్రాంతాలకు చెందిన శివరాత్రి చందు, చింతగుంట శివనాగ తేజ, గొల్ల మధు స్నేహితులు. ప్రైవేట్ ఉద్యోగులైన వీరిలో నాగతేజ ప్రస్తుతం కుందన్ బాగ్‌లోని ఓ హాస్టల్లో ఉంటున్నాడు. ఈ ముగ్గురూ మద్యానికి బానిసలుగా మారారు. ఏపీ కంటే తెలంగాణలో మద్యం ధరలు తక్కువ కావడంతో తాగడానికే చందు, మధు తరచూ తేజ వద్దకు వచ్చేవాళ్లు. పగలంతా మద్యం సేవించి రాత్రికి మళ్లీ బస్సెక్కి వెళ్లిపోయేవారు. ఇటీవల కాలంలో మద్యానికి కూడా డబ్బులు లేకపోవడంతో ఈ ముగ్గురూ కలిసి వాహనాలు చోరీ చేయాలని పథకం వేశారు. ఆసిఫ్‌నగర్, ఎస్సార్ నగర్ ప్రాంతాల్లో ని హాస్టళ్లలో పార్కింగ్ సదుపాయం లేకపోవడంతో హాస్టళ్లలో ఉండే వాళ్ల స్పోర్ట్స్ బైకులను చోరీ చేసేందుకు ప్లాన్ వేసుకున్నారు. వాటిని ఎలా తస్కరించాలో తెలుసుకోవడానికి యూట్యూబ్‌లో సెర్చ్ చేశారు. ఆ వీడియోల ఆధారంగా చోరీలు చేయడం ప్రారంభించారు. చోరీ చేసిన వాహనాలను నరసరావుపేటలోని మధు ఇంటి సమీపంలోని నిర్మానుష్య ప్రాంతాల్లో దాచి.. మళ్లీ సిటీకి వచ్చేవాళ్లు. ఇలా కేవలం 12 రోజుల్లో ఆసిఫ్‌నగర్, ఎస్సార్‌నగర్, కేపీహెచ్‌బీల్లో 8 పల్సర్ స్పోర్ట్స్ బైక్స్ చోరీ చేశారు. ఈ చోరీలను ఛేదించడానికి ఆసిఫ్‌నగర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ ఎన్.శ్రీనివాస్ టీమ్ రంగంలోకి దిగింది. దాదాపు 100 సీసీ కెమెరాల్లో రికార్డయిన ఫీడ్‌ను పరిశీలించిన టీమ్ అందులో దొరికిన క్లూతో ముగ్గురినీ అరెస్టు చేసి, 8 వాహనాలు స్వాదీనం చేసుకున్నారు. -
మార్కెట్లోకి ‘పల్సర్ 125 నియాన్’ బైక్
న్యూఢిల్లీ: ప్రముఖ వాహన తయారీ కంపెనీ బజాజ్ ఆటో తాజాగా ‘పల్సర్ 125 నియాన్’ బైక్‌ను మార్కెట్లోకి విడుదలచేసింది. ఈ మోడల్లో డ్రమ్ బ్రేక్ వెర్షన్ ధర రూ.64,998 (ఎక్స్‌షోరూమ్ – ఢిల్లీ) కాగా, డిస్క్ బ్రేక్ ఆప్షన్ ధర రూ.66,618 ఉన్నట్లు కంపెనీ ప్రకటించింది. రెండు వేరియంట్లలోనూ 125సీసీ ఇంజిన్ అమర్చింది. గేర్‌లో ఉన్నప్పుడు కూడా స్టార్ట్ అయ్యే విధంగా రూపొందించిన ఈ బైక్‌కు 5–స్పీడ్ గ్రేర్బాక్స్ ఉన్నట్లు తెలిపింది. ఈ సందర్భంగా బజాజ్ ఆటో మోటార్ సైకిల్ విభాగ ప్రెసిడెంట్ సారంగ్ కనడే మాట్లాడుతూ.. ‘స్పోర్టీ మోడల్‌ను ఇష్టపడే వారికోసం రూపొందించిన అధునాతన బైక్ ఇది. స్టైల్, పనితీరు పరంగా ఇట్టే ఆకట్టుకునే ఈ బైక్‌ను తక్కువ ధరకే అందిస్తున్నాం’ అని అన్నారు. -
పల్సర్ 150లో కొత్త వేరియంట్
న్యూఢిల్లీ: బజాజ్ ఆటో కంపెనీ పల్సర్ 150 సీసీ కేటగిరీలో కొత్త వేరియంట్‌ను మార్కెట్లోకి తెచ్చింది. పల్సర్ 150 నియాన్ పేరుతో అందిస్తున్న బైక్ ధర రూ.64,998గా (ఎక్స్‌షోరూమ్, ఢిల్లీ) నిర్ణయించామని బజాజ్ ఆటో తెలిపింది. 100–110 సీసీ బైక్‌లను మించిన పనితీరు కావాలనుకునే వినియోగదారులు లక్ష్యంగా ఈ కొత్త పల్సర్ 150 నియాన్‌ను తెస్తున్నామని కంపెనీ మోటార్ సైకిల్స్ విభాగం ప్రెసిడెండ్ ఎరిక్ వాస్ పేర్కొన్నారు. 100/110 సీసీ కంటే ఎక్కువ ఇంజిన్ సామర్థ్యం ఉన్న బైక్ కొనాలనుకునే వారికి తొలి ఎంపిక ఇదే అవుతుందన్నారు. ఈ బైక్‌ను 4–స్ట్రోక్, 2– వాల్వ్, ట్విన్ స్పార్క్, ఎయిర్ కూల్డ్ డీటీఎస్–ఐ ఇంజిన్‌తో రూపొందించామని, 5 గేర్లు, ముందు భాగంలో 240 ఎమ్ఎమ్ డిస్క్ బ్రేక్, వెనక భాగంలో 130 సీసీ డ్రమ్ బ్రేక్లున్నాయని వివరించారు. ఈ బైక్...హోండా సీబీ యూనికార్న్ 150, హీరో అచీవర్ 150, యమహా ఎస్‌జడ్–ఆర్ఆర్ తదితర బైక్‌లకు గట్టిపోటీనిస్తుందని పరిశ్రమ వర్గాలంటున్నాయి. -
ట్విన్ డిస్క్ బ్రేక్స్‌తో బజాజ్ ‘పల్సర్ 150’
న్యూఢిల్లీ: ప్రముఖ వాహన తయారీ కంపెనీ ‘బజాజ్ ఆటో’ తాజాగా తన బెస్ట్ సెల్లింగ్ మోడల్ ‘పల్సర్ 150’లో సరికొత్త వెర్షన్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఇందులో ట్విన్ డిస్క్ బ్రేక్స్, షార్పర్ డిజైన్, కొత్త కలర్ స్కీమ్స్, స్లి్పట్ సీట్స్, లాంగర్ వీల్ బేస్ వంటి పలు ప్రత్యేకతలున్నాయి. దీని ధర రూ.78,016 (ఎక్స్‌షోరూమ్ ఢిల్లీ). ప్రస్తుత సింగిల్ డిస్క్ మోడల్‌కు తాజా వెర్షన్ అదనంగా కస్టమర్లకు అందుబాటులో ఉంటుందని కం పెనీ తెలిపింది. ట్విన్ డిస్క్ బ్రేక్స్ పల్సర్ 150 ప్రధానంగా బ్లాక్ బ్లూ, బ్లాక్ రెడ్, బ్లాక్ క్రోమ్ అనే మూడు డ్యూయెల్ టోన్ రంగుల్లో లభ్యమౌతుందని పేర్కొంది. ఇంజిన్, చాసిస్ టచ్పాయింట్ల ఆప్టిమైజేషన్‌తో నాయిస్, వైబ్రేషన్ అండ్ షార్‡్షనెస్ (ఎన్వీహెచ్)లో మెరుగుదల తీసుకువచ్చామని తెలిపింది. పనితీరు, మైలేజ్ వంటి అంశాలకు ప్రాధాన్యమిచ్చే యువకులు లక్ష్యంగా ఈ బైక్‌ను రూపొందించినట్లు బజాజ్ ఆటో ప్రెసిడెంట్ ఎరిక్ వాస్ తెలిపారు. -
బజాజ్ పల్సర్ ఎన్ఎస్160
ధర రూ. 80,648 (ముంబై) న్యూఢిల్లీ: ఆటోమొబైల్ దిగ్గజం బజాజ్ ఆటో శుక్రవారం 160సీసీ పల్సర్ ఎన్ఎస్160ని ఆవిష్కరించింది. దీని ధర రూ. 80,648 (ముంబై ఎక్స్‌షోరూం)గా ఉంటుంది. ప్రీమియం నాణ్యత, అంతర్జాతీయ ప్రమాణాల స్టైల్, పనితీరు కోరుకునే యువ కస్టమర్ల కోసం దీన్ని తీర్చిదిద్దినట్లు కంపెనీ ప్రెసిడెంట్ (మోటార్‌సైకిల్స్ విభాగం) ఎరిక్ వాస్ తెలిపారు. ప్రస్తుతం స్పోర్ట్స్ బైకింగ్ సెగ్మెంట్లో ఎక్కువగా 150–160 సీసీ మోటార్ సైకిల్సే ఉంటున్నాయని ఆయన తెలియజేశారు. ఇదే సీసీ సామర్ధ్యంలోనే మరింత మెరుగైన టెక్నాలజీ, పనితీరు కోరుకునే వారి కోసం ఎన్ఎస్ 160ని డిజైన్ చేసినట్లు వాస్ పేర్కొన్నారు. ఈ బైక్‌తో స్పోర్ట్స్ మోటార్‌సైకిల్స్ విభాగంలో తమ స్థానాన్ని మరింత పటిష్టం చేసుకోనున్నట్లు ఆయన తెలిపారు. -
డీవైడర్‌ను ఢీకొట్టిన పల్సర్... వ్యక్తి మృతి
గుంటూరు రూరల్: గుంటూరు నగరం సమీపంలో ఆదివారం మధ్యాహ్నం ఓ ద్విచక్ర వాహనం డివైడర్‌ను ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన ఎ.విజయభాస్కర్(48) గుంటూరులోని నవభారత్ కాలనీలో ఓ ఫర్నిచర్ షాపులో గుమస్తాగా పనిచేస్తున్నాడు. ఇతడు మరో ఇద్దరితో కలసి పల్సర్ బైక్‌పై నవభారత్ కాలనీ నుంచి గుంటూరు వైపు వస్తుండగా అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టడమే కాకుండా, రాసుకుంటూ కొంత దూరం ముందుకు వెళ్లింది. ఈ ప్రమాదంలో విజయభాస్కర్‌కు తీవ్ర గాయాలు కావడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. మిగతా ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడు విజయభాస్కర్‌కు భార్య విజయలక్ష్మి, ఇద్దరు పిల్లలు ఉన్నారు.