
న్యూఢిల్లీ: ప్రముఖ వాహన తయారీ కంపెనీ ‘బజాజ్ ఆటో’ తాజాగా తన బెస్ట్ సెల్లింగ్ మోడల్ ‘పల్సర్ 150’లో సరికొత్త వెర్షన్‌ను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. ఇందులో ట్విన్ డిస్క్ బ్రేక్స్, షార్పర్ డిజైన్, కొత్త కలర్ స్కీమ్స్, స్లి్పట్ సీట్స్, లాంగర్ వీల్ బేస్ వంటి పలు ప్రత్యేకతలున్నాయి. దీని ధర రూ.78,016 (ఎక్స్‌షోరూమ్ ఢిల్లీ). ప్రస్తుత సింగిల్ డిస్క్ మోడల్‌కు తాజా వెర్షన్ అదనంగా కస్టమర్లకు అందుబాటులో ఉంటుందని కం పెనీ తెలిపింది. ట్విన్ డిస్క్ బ్రేక్స్ పల్సర్ 150 ప్రధానంగా బ్లాక్ బ్లూ, బ్లాక్ రెడ్, బ్లాక్ క్రోమ్ అనే మూడు డ్యూయెల్ టోన్ రంగుల్లో లభ్యమౌతుందని పేర్కొంది.
ఇంజిన్, చాసిస్ టచ్‌పాయింట్ల ఆప్టిమైజేషన్‌తో నాయిస్, వైబ్రేషన్ అండ్ షార్‡్షనెస్ (ఎన్‌వీహెచ్)లో మెరుగుదల తీసుకువచ్చామని తెలిపింది. పనితీరు, మైలేజ్ వంటి అంశాలకు ప్రాధాన్యమిచ్చే యువకులు లక్ష్యంగా ఈ బైక్‌ను రూపొందించినట్లు బజాజ్ ఆటో ప్రెసిడెంట్ ఎరిక్ వాస్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment