
బజాజ్... మూడు కొత్త అవెంజర్ మోడళ్లు
హైదరాబాద్: ప్రముఖ వాహన తయారీ కంపెనీ బజాజ్ ఆటో.. ఇటీవల మూడు కొత్త అవెంజర్ మోడళ్లను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. వాహన రైడర్లకు అనువుగా ఉండే విధంగా స్ట్రీట్ 150, క్రూయిజ్ 220, స్ట్రీట్ 220 అనే అవెంజర్ మోడళ్లను రూపొం దించామని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. క్రూయిజ్ 220, స్ట్రీట్ 220 బైకుల్లో 20 సీసీ డీటీఎస్‌ఐ ఇంజిన్, స్ట్రీట్ 150 బైక్‌లో 150 సీసీ డీటీఎస్‌ఐ ఇంజిన్‌ను పొందుపరిచామని పేర్కొంది. స్ట్రీట్ బైక్స్ గంటకు 90-100 కిలోమీటర్ల వేగాన్ని, క్రూయిజ్ బైక్ 110 కిలోమీటర్ల వేగాన్ని అందిస్తుందని వివరించింది. స్ట్రీట్ 150 బైక్ ధర రూ. 74,000 (ఎక్స్‌షోరూమ్ ఢిల్లీ)గా, క్రూయిస్ 220, స్ట్రీట్ 220 ధర రూ.84,000 (ఎక్స్‌షోరూమ్ ఢిల్లీ)గా ఉంది. పొడవైన వీల్‌బేస్, తక్కువ ఎత్తులో డిజైన్ చేసిన సీటింగ్ సౌకర్యాలు రైడర్లకు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయని, లాంగ్ రైడ్‌కు క్రూయిస్ 220, వారంతంలో రైడ్ చేయడానికి స్ట్రీట్ 150, స్ట్రీట్ 220 బైకులు అనువుగా ఉంటాయని కంపెనీ పేర్కొంది.