మార్కెట్లోకి ‘బజాజ్‌మాగ్జిమ–సీ’ త్రీ
డాబాగార్డెన్స్: బజాజ్ ఆటో కంపెనీ సరికొత్తగా మార్కెట్లోకి ‘బజాజ్ మాగ్జిమ–సీ’ త్రీ వీలర్ కార్గో ఆటోని సోమవారం విడుదల చేసింది. సంస్థ రీజనల్ మేనేజర్ బి.రాఘవరావు నగరంలోని ఓ హోటల్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎటువంటి ఇబ్బందుల్లేకుండా మంచి త్రీవీలర్ కార్గోను అందివ్వడమే సంస్థ ధ్యేయంగా అధునాతనంగా రూపొందించినట్టు చెప్పారు. గూడ్స్‌ను సురక్షితంగా, వేగంగా డెలివరీ చేయడం ఈ కార్గో ఆటో విశేషమన్నారు. 447 సీసీ పవర్ ఇంజన్, 35 వేల కిలోమీటర్ల వరకు పవర్‌క్లబ్ లైఫ్ ఉంటుందని, పవర్ కప్లింగ్‌తో మెయింట్‌నెన్స్, డ్రై వింగ్ చేసేటప్పుడు ఎటువంటి హానీ, నష్టం లేకుండా పవర్ సస్పెన్సన్ గల కార్గో వెహికలని చెప్పారు. ఏజెన్సీ, ఎత్తు పల్లాల రోడ్డులో సునాయాసంగా వెళ్లే వాహనమని పేర్కొన్నారు. షోరూం ధర లక్షా 88 వేల 500గా నిర్ణయించినట్టు చెప్పారు.. కార్యక్రమంలో వరుణ్ బజాన్ జనరల్ మేనేజర్ వంశీ తదితరులు పాల్గొన్నారు.