
బజాజ్ సూపర్ స్పోర్ట్స్ ‘పల్సర్ ఆర్‌ఎస్ 200’ బైక్
ధర రూ. 1,18,500-1,30,268
ముంబై: ప్రముఖ ఆటోమొబైల్ తయారీ కంపెనీ బజాజ్, స్పోర్ట్స్ బైక్స్ ప్రియుల కోసం ‘పల్సర్ ఆర్‌ఎస్ 200’ అనే సూపర్ స్పోర్ట్స్ బైక్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. లిక్విడ్ కూలింగ్, ఫ్యూయల్ ఇంజెక్షన్‌తో కూడిన 4 వాల్వ్స్ స్పార్క్ డీటీఎస్‌ఐ ఇంజన్ దీని సొంతం. ఈ బైక్ గరిష్ట వేగం గంటకు 141 కిలోమీటర్లు. దీనిలోని నాన్-ఏబీఎస్ వెర్షన్ ధర రూ.1,18,500గా, ఏబీఎస్ (యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్) వెర్షన్ ధర రూ.1,30,268గా (అన్ని ధరలు మహారాష్ట్ర ఎక్స్ షోరూం) ఉంది.
ఎలాంటి వేగంలోనైనా, రోడ్లపైనైనా బైక్‌ను బాగా కంట్రోల్ చే యటానికి ఏబీఎస్ ఉపయోగపడుతుంది. ఈ బైక్ ద్వారా తమ కంపెనీ లక్ష రూపాయలకు పైగా ధరున్న బైక్‌ను తొలిసారి మార్కెట్‌లోకి విడుదల చేసిందని బజాబ్ ఆటో మోటార్‌సైకిల్ ప్రెసిడెంట్ ఎరిక్ వాస్ చెప్పారు. నెలకు 2,500 యూనిట్ల పల్సర్ ఆర్‌ఎస్ 200 బైకుల విక్రయాలను లక్ష్యంగా నిర్దేశించుకున్నామని ఆయన తెలిపారు.