super sports bike
-
డుకాటీ సూపర్ స్పోర్ట్స్ బైక్స్
సాక్షి, న్యూఢిల్లీ: సూపర్ లగ్జరీ బైక్ మేకర్ డుకాటీ సరికొత్త సూపర్ స్పోర్ట్స్ బైక్‌లను భారత మార్కెట్లో శుక్రవారం లాంచ్ చేసింది. సూపర్ స్పోర్ట్, సూపర్ స్పోర్ట్ ఎస్ పేరుతో రెండు వేరియంట్లను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. వీటి ప్రారంభ ధర రూ. 12.08 లక్షలు (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ)గా నిర్ణయించింది. సూపర్ స్పోర్ట్ బేస్ వెర్షన్ రూ.12.08 లక్షలు గాను, సూపర్ స్పోర్ట్ ఎస్ ధర రూ. 13.39 లక్షలు, తెల్ల రంగు కోసం రూ.13.6 లక్షలుగా ప్రకటించింది. పవర్ ఫుల్ టెస్టా ట్రెట్టా 11 లీటర్ల ట్విన్ ఇంజీన్‌తో వీటిని లాంచ్ చేసింది. 6 స్పీడ్ గేర్‌బాక్స్, ఆల్-డిజిటల్ ఎల్సీడీ డిస్ప్లే, 8 లెవల్ ట్రాక్షన్ కంట్రోల్ సిస్టం, 110పీస్, 93ఎన్ఎం పీక్ టార్క్ ఇతర ప్రధాన ఫీచర్లుగా ఉన్నాయి. కాగా డుకాటీ సూపర్ స్పోర్ట్ బైక్స్ భారతీయ టూవీలర్ మార్కెట్ లో కవాసాకీ నింజా 1000, సుజుకి జీఎస్ఎక్స్-S1000F లాంటి ఇతర సూపర్ బైక్‌లను గట్టి పోటీ ఇస్తుందని అంచనా. -
బజాజ్ సూపర్ స్పోర్ట్స్ ‘పల్సర్ ఆర్ఎస్ 200’ బైక్
ధర రూ. 1,18,500-1,30,268 ముంబై: ప్రముఖ ఆటోమొబైల్ తయారీ కంపెనీ బజాజ్, స్పోర్ట్స్ బైక్స్ ప్రియుల కోసం ‘పల్సర్ ఆర్ఎస్ 200’ అనే సూపర్ స్పోర్ట్స్ బైక్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. లిక్విడ్ కూలింగ్, ఫ్యూయల్ ఇంజెక్షన్‌తో కూడిన 4 వాల్వ్స్ స్పార్క్ డీటీఎస్ఐ ఇంజన్ దీని సొంతం. ఈ బైక్ గరిష్ట వేగం గంటకు 141 కిలోమీటర్లు. దీనిలోని నాన్-ఏబీఎస్ వెర్షన్ ధర రూ.1,18,500గా, ఏబీఎస్ (యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్) వెర్షన్ ధర రూ.1,30,268గా (అన్ని ధరలు మహారాష్ట్ర ఎక్స్ షోరూం) ఉంది. ఎలాంటి వేగంలోనైనా, రోడ్లపైనైనా బైక్‌ను బాగా కంట్రోల్ చే యటానికి ఏబీఎస్ ఉపయోగపడుతుంది. ఈ బైక్ ద్వారా తమ కంపెనీ లక్ష రూపాయలకు పైగా ధరున్న బైక్‌ను తొలిసారి మార్కెట్లోకి విడుదల చేసిందని బజాబ్ ఆటో మోటార్‌సైకిల్ ప్రెసిడెంట్ ఎరిక్ వాస్ చెప్పారు. నెలకు 2,500 యూనిట్ల పల్సర్ ఆర్ఎస్ 200 బైకుల విక్రయాలను లక్ష్యంగా నిర్దేశించుకున్నామని ఆయన తెలిపారు.