
క్యూ4 ఫలితాలు: 8కె మైల్స్, బ్లూ డార్ట్, కోరమాండల్ ఇంటర్నేషనల్, దీపక్ నైట్రైట్, జయప్రకాశ్ పవర్, వండరెల్లా హాలిడేస్, వీఐపీ ఇండస్ట్రీస్, టొరంట్ ఫార్మాసూటికల్స్, ఎస్‌హెచ్ కేల్కర్, మ్యాక్స్ ఫైనాన్షియల్‌లు మంగళవారం మార్చితో ముగిసిన త్రైమాసిక ఫలితాలను వెల్లడించనున్నాయి.
ఎవెన్యూ సూపర్ మార్ట్స్: 2019 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో కన్సాలిడేటెడ్ నికర లాభం 41.6 శాతం పెరిగి రూ.271.28 కోట్లకు చేరిందని ఈ కంపెనీ వెల్లడించింది.అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఇదే త్రైమాసికంలో నికర లాభం రూ.191.57 కోట్లుగా నమోదైంది.
ఆన్‌మొబైల్ గ్లోబల్: కెనేడియన్ సబ్సిడరీ కంపెనీ ద్వారా టెక్నాలజీస్ రోబో కంపెనీలో 25 శాతం వాటాను కొనుగోలు చేసినట్లు ఆన్‌మొబైల్ గ్లోబల్ వెల్లడించింది. మొబైల్స్‌కు కొత్త టెక్నాలజీతో గేమ్స్ అందించే లక్ష్యంతో ఈ వాటా కొనుగోలు జరిపినట్లు ఈ కంపెనీ తెలిపింది.
ఐటీసీ: సన్‌రైజ్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్‌ను పూర్తిస్థాయిలో సొంతం చేసుకోనున్నట్లు ఐటీసీ వెల్లడించింది.
డీసీబీ బ్యాంక్: మార్చితో ముగిసిన క్యూ4లో నికర లాభం28 శాతం తగ్గి రూ.69 కోట్లుగా నమోదైనట్లు డీసీబీ బ్యాంక్ తెలిపింది.
హెచ్‌ఐఎల్: ఇరాన్‌లో మిడతలను సంహరించేందుకు 25 టన్నుల పురుగు మందులను సరఫరా చేయనున్నట్లు హెచ్‌ఐఎల్ వెల్లడించింది.
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర: ఎంఎస్‌ఎంఈ, సెల్ప్‌హెల్ప్ గ్రూప్, అగ్రికల్చర్ అండ్ రిటైల్ రుణగ్రహీతలకు రూ.2,789 కోట్ల రుణాన్ని మంజూరు చేసినట్లు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర వెల్లడించింది.
యూపీఎల్: మార్చితో ముగిసిన క్యూ4లో కన్సాలిడేటెడ్ నికర లాభం రెండు రెట్లు పెరిగి రూ.617 కోట్లకు చేరిందని యూపీఎల్ వెల్లడించింది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో నికర లాభం రూ.250 కోట్లుగా ఉంది.
జేఎస్‌డబ్ల్యూ: 2020-21 క్యాపెక్స్ ప్రణాళికను 45 శాతం తగ్గి రూ.9,000 కోట్లుగా నిర్ణయించింది. ఆర్థిక సంవత్సరం-21లో క్యాపెక్స్ ప్రణాళికను రూ.16,340 కోట్లుగా నిర్ణయిచింది.
ట్రెంట్: నాలుగో త్రైమాసికంలో కన్సాలిడేటెడ్ నికర లాభం రూ.321.64కోట్లుగా నమోదైనట్లు ఈ కంపెనీ వెల్లడించింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో నికర నష్టం రూ.418.99 కోట్లుగా ఉంది.
బేయర్ క్రాప్‌సైన్సెస్: 2019-20 ఆర్థిక సంవత్సరంలో నికర లాభం రూ.31.5 కోట్లుగా నమోదైనట్లు ఈ కపెనీ వెల్లడించింది. అంతకు ముందు ఏడాది ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో నికర నష్టం రూ.57.1 కోట్లుగా ఉంది.
రిలయన్స్ ఇండస్ట్రీస్: కేజీ-డీ6 ఉత్పత్తికి సంబంధించి తొమ్మిదేళ్లుగా ఎదుర్కోంటున్న వివాదం నేపథ్యంలో ప్రభుత్వానికి లయబిలిటీకింద రూ.3,000 కోట్లు చెల్లించాల్సిఉంటుందని ఆర్‌ఐఎల్ అంచనావేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment