ఇసుక అక్రమ నిల్వదారులపై కేసు
Published Sat, Oct 15 2016 1:43 AM | Last Updated on Mon, Sep 4 2017 5:12 PM
కొవ్వూరు : వాడపల్లి ర్యాంపులో ఇసుకను అక్రమంగా నిల్వ చేస్తున్న ఏడుగురిపై కేసు నమోదు చేసినట్టు పట్టణ ఎస్సై డి.గంగాభవానీ తెలిపారు. ఆమె కథనం ప్రకారం.. కూనల రెడ్డి, మెల్లిన హనుమంతరావు, కరుటూరి రాంబాబు, కరుటూరి కాశీవిశ్వనాథం, ప్రగడ నాగయ్య, ప్రగడ వీర్రాఘవులు, బొల్లా ఆంజనేయులు ప్రభుత్వ ఉత్తర్వులను లెక్క చేయకుండా మూసివేసిన వాడపల్లి ర్యాంపులో ఇసుక నిల్వ చేస్తూ.. అధిక ధరలకు విక్రయిస్తున్నారు. శుక్రవారం వీరు ఏడు పడవల్లో కూలీలను పెట్టి ఇసుక తవ్వకాలు చేసి ర్యాంపుల్లో గుట్టలుగా పోశారు. దీనిపై వాడపల్లి వీఆర్‌ఏ చెల్లె జగజ్జీవన్‌రావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏడుగురిపై కేసు నమోదు చేసినట్టు ఎస్సై తెలిపారు.
Advertisement
Advertisement