సాక్షి, ముంబై: అతిపెద్ద బ్యాంకు కుంభకోణంలో ఇరుక్కున్న దేశీయ రెండో అతిపెద్ద బ్యాంకు పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ను నష్టాలు వదిలిపెట్టడం లేదు. వరుసగా రెండవ క్వార్టర్‌లో కూడా నష్టపోవడంతో పీఎన్‌బీ షేరు భారీగా నష్టపోయింది. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో ఆ బ్యాంకు భారీగా నష్టాలను చవి చూవడడంతో ఇన్వెస్టర్లు అమ్మకాలకు తెరతీశారు. దీంతో పీఎన్‌బీ షేరు ఒక దశలో దాదాపు 9శాతం కుప్పకూలింది.. చివరికి 7శాతం నష్టంతో రూ.82.90 వద్ద ముగిసింది.
జూన్ 30తో ముగిసిన 2018-19 తొలి త్రైమాసికంలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ రూ.940 కోట్ల నష్టాలను నమోదు చేసింది. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో పీఎన్‌బీ నికర లాభం కేవలం రూ.343 కోట్లు మాత్రమే. ఇక మొత్తం ఆదాయం రూ.15,072 కోట్లుగా నమోదైంది. అంతక్రితం ఏడాది పీఎన్‌బీ ఆదాయం రూ.14,468గా ఉంది. మార్చితో ముగిసిన గత త్రైమాసికంలో బ్యాంక్ 13,417 కోట్ల రూపాయల నష్టాన్ని చవిచూసింది. ఇక మొండి బకాయిలు 18.26 శాతం పెరిగినట్లు బ్యాంకు ఓ ప్రకటనలో తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment