Tesla CEO Elon Musk Loses 20 Billion US Dollars - Sakshi
Sakshi News home page

ఆ ఒక్క మాటతో.. ఎలాన్‌ మస్క్‌కు రూ.1.64 లక్షల కోట్లు నష్టం!

Published Fri, Jul 21 2023 4:13 PM | Last Updated on Fri, Jul 21 2023 4:31 PM

Tesla Ceo Elon Musk Loses 20 Billion - Sakshi

టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌కు భారీ షాక్‌ తగిలింది. టెస్లా కార్ల ధరల్ని తగ్గిస్తామంటూ మస్క్‌ చేశారు. అంతే ఆ నిర్ణయంతో టెస్లా షేర్ వ్యాల్యూ భారీగా క్షీణించింది. మస్క్‌ సంపదలో 20.3 బిలియన్ డాలర్లు (రూ.1.64లక్షల కోట్లు) కోల్పోయారు. 

బ్లూంబెర్గ్‌ బిలియనీర్‌ ఇండెక్స్‌ ప్రకారం..ఎలాన్‌ మస్క్‌ మొత్తం సంపద 234.4 బిలియన్‌ డాలర్లుగా ఉంది. అయితే ఈ ఏడాది ప్రారంభం నుంచి మస్క్‌ ప్రతీరోజు 530 మిలియన్‌ డాలర్లు సంపాదించినట్లు నివేదిక పేర్కొంది. ప్రస్తుతం, మస్క్‌ నెట్‌ వర్త్‌ను మొత్తంలో ఏడు సార్లు కోల్పోయారు. అయినప్పటికీ, ప్రపంచ ధనవంతుల జాబితాలో ప్రథమ స్థానంలో కొనసాగుతున్నారు. 

ప్రముఖ లగర్జీ గృహోపకరణాల సంస్థ ఎల్‌వీఎంహెచ్‌ అధినేత బెర్నార్డ్ ఆర్నాల్ట్ 201 బిలియన్‌ డాలర్లతో రెండవ స్థానంలో కొనసాగుతున్నారు. మస్క్‌కు ఆర్నాల్ట్‌ల మధ్య వ్యత్యాసం కేవలం 33 బిలియన్‌ డాలర్లు మాత్రమే. 

మస్క్‌తో పాటు 
ఒక‍్కరోజులోనే భారీ మొత్తంలో సంపద కోల్పోయిన జాబితాలో టెస్లా సీఈవోతో పాటు ప్రముఖ టెక్‌ దిగ్గజ కంపెనీల అధినేతలు సైతం ఉన్నారు. వారిలో అమెజాన్‌ సీఈవో జెఫ్‌ బెజోస్‌, ఒరాకిల్‌ కార్పొరేషన్‌ లారీ ఎల్లిసన్, మైక్రోసాఫ్ట్‌ మాజీ సీఈవో స్టీవ్ బల్మెర్‌, మెటా బాస్‌ మార్క్‌ జుకర్‌ బర్గ్‌, ఆల్ఫాబెట్‌ కోఫౌండర్‌ లారీ పేజ్‌,సెర్గీ బ్రిన్‌ ఇలా టెక్‌ కంపెనీల సంపద 2.3శాతంతో 20.3 బిలియన్‌ డాలర్ల సంపద నష్టపోయినట్లు అమెరికన్‌ స్టాక్‌ మార్కెట్‌ నాస్‌డాక్‌ 100 ఇండెక్స్‌ తెలిపింది. 

ఒక్కరోజే 9.7 శాతం 
న్యూయార్క్‌ కేంద్రంగా ఎలక్ట్రిక్‌ కార్ల తయారీ కార్యకలాపాలు నిర్వహిస్తున్న టెస్లా షేర్ల విలువ ఏప్రిల్‌ 20 నుంచి తగ్గుతూ వస్తున్నాయి. జులై 20న 9.7 శాతంతో టెస్లా షేర్‌ ధర 262.90 డాలర్ల వద్ద కొనసాగుతూ వస్తుంది.  ఇక, ఏప్రిల్ 20 నుండి టెస్లా భారీ నష్టాల్ని చవిచూస్తున్నట్లు మస్క్‌ ఓ సందర్భంలో తెలిపారు. 

టెస్లా మదుపర్లలో అలజడి
అంతేకాదు ఈ ఏడాది రెండవ త్రైమాసికంలో నాలుగు సంవత్సరాల కనిష్టానికి పడిపోయి గ్రాస్‌ మార్జిన్‌పై ప్రతికూల ప్రభావం చూపించాయి. తాజాగా, అమెరికా ప్రభుత్వం ఆర్ధిక మాంద్యాన్ని అదుపు చేసేందుకు వడ్డీ రేట్లు పెంచుకుంటూ పోతే టెస్లా ధరలను తగ్గించాల్సి ఉంటుందని కంపెనీ మస్క్ హెచ్చరించారు. మస్క్‌ చేసిన ఈ ప్రకటనతో టెస్లా షేర్‌ హోల్డర్లలో తీవ్ర అలజడిని రేపింది. షేర్లను అమ్ముకోవడంతో ఎలాన్‌ మస్క్‌ సంపద భారీ క్షిణీంచింది. 

చదవండి👉 భారత్‌లో టెస‍్లా కార్ల తయారీ.. ధరెంతో తెలిస్తే ఎగిరి గంతేస్తారు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement