
వారికి మద్యం స్టాకు విడుదల చేయాలి
ఎక్సైజ్ అధికారులకు హైకోర్టు ఆదేశం
సాక్షి, హైదరాబాద్: మద్యం సీసాలపై బార్ కోడ్ నిమిత్తం షాపుల్లో సాఫ్ట్‌వేర్ ఏర్పాటు చేసుకుని, కోర్టును ఆశ్రయించిన వారికి మద్యం స్టాకు విడుదల చేయాలని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ అధికారులను హైకోర్టు ఆదేశించింది. సాఫ్ట్‌వేర్ ఏర్పాటుకు సంబంధించి కార్వీ డేటా మేనేజ్‌మెంట్ సర్వీసెస్‌తో ఒప్పందం చేసుకోవాలంటూ పిటిషనర్లను బలవంతం చేయొద్దని స్పష్టం చేసింది.
ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్ ఇటీవల మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. తదుపరి విచారణను ఈ నెల 29కి వాయిదా వేశారు. బార్‌కోడ్ నిమిత్తం స్కానర్లు, సాఫ్ట్‌వేర్ ఏర్పాటు కోసం కార్వీ సంస్థతో ఒప్పందం చేసుకోవాలని అధికారులు ఒత్తిడి చేస్తూ మద్యం స్టాకులు విడుదల చేయటం లేదని పలువురు మద్యం దుకాణాల యజమానులు హైకోర్టును ఆశ్రయించారు.