
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వానికి మద్యంపై ఆదాయం వద్దని, ప్రజారోగ్యమే ప్రాధాన్యత అని ఎక్సైజ్ శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం నారాయణస్వామి స్పష్టం చేశారు. ఆదివారం ఆయన ఎక్సైజ్ శాఖపై సమీక్ష నిర్వహించారు. గత ప్రభుత్వంలో అమ్మకాలతో పోలిస్తే.. లిక్కర్ అమ్మకాల్లో 31%, బీరు అమ్మకాల్లో 49.74 % తగ్గుదల నమోదైందన్నారు. మద్యం అమ్మకాల విలువ రూ.1,944 కోట్లు కోల్పోయినా సీఎం జగన్ మహిళలకు ఇచ్చిన మాటకు కట్టుబడి మద్య నియంత్రణ వైపు అడుగులేస్తున్నట్లు చెప్పారు.
► గత ప్రభుత్వ హయాంలో మద్యం షాపునకు అనుబంధంగా ఉన్న పర్మిట్ రూముల వల్ల ఏడాదికి రూ.164 కోట్ల ఆదాయం వచ్చేది. ఈ ఆదాయాన్ని లెక్క చేయకుండా ప్రభుత్వమే మద్యం షాపులను నిర్వహిస్తూ పర్మిట్ రూములను రద్దు చేసింది.
► ప్రైవేటు వ్యక్తులకు, మద్యం మాఫియాకు అడ్డుకట్ట వేసి వారి నుంచి లైసెన్సు ఫీజు రూపంలో వచ్చే రూ.400 కోట్ల ఆదాయాన్ని వదులుకుంది.
► ఏడాదిలోనే 33 శాతం మద్యం షాపులు తగ్గించడంతో పాటు షాపుల వేళలు కుదించాం. 43 వేల బెల్టు షాపులు రద్దు చేశాం.
► స్పెషల్ ఎన్‌ఫోర్సుమెంట్ బ్యూరో ఏర్పాటు చేసిన నెల రోజుల్లోనే 84,412 లీటర్ల సారా సీజ్ చేశాం. 14,84,627 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం, 54,594 కేజీల నల్లబెల్లం స్వాధీనం, 67,512 లీ టర్ల నాన్ డ్యూటీ పెయిడ్ లిక్క ర్, 4,732 లీటర్ల బీరు, 5,514 వాహనాలను సీజ్ చేశాం.
Comments
Please login to add a commentAdd a comment