అప్పుడు లేవన్నారు.. ఇప్పుడు పారేశారు | medicines not given to patients in mulugu hospital | Sakshi
Sakshi News home page

అప్పుడు లేవన్నారు.. ఇప్పుడు పారేశారు

Published Sat, Aug 13 2016 11:50 PM | Last Updated on Tue, Oct 16 2018 3:25 PM

అప్పుడు లేవన్నారు.. ఇప్పుడు పారేశారు - Sakshi

అప్పుడు లేవన్నారు.. ఇప్పుడు పారేశారు

  • జూలైతో వాడకం గడువు ముగిసిన ఔషధాలు పడేసిన వైనం
  • మందులు ఉన్నా.. రోగులకు అందించని వైద్య సిబ్బంది
  • ములుగు : అది ములుగు ప్రభుత్వ సివిల్‌ ఆస్పత్రి. అక్కడికి వెళితే డాక్టర్‌ పరీక్షించి మందులు రాస్తారు. ఇక్కడి దాకా అంతా బాగానే ఉంటుంది. ఆ తర్వాత జరిగే కథే వేరు. చిన్నపాటి జ్వరానికి సంబంధించిన ఇంజక్షన్‌ కూడా బయట వేయించుకోమంటూ ఉచిత సలహాలను రోగుల మెుహాన పడేస్తారు. మందులను ప్రైవేట్‌ మెడికల్‌ షాపుల్లో తీసుకోమంటూ దవాఖాన సిబ్బంది ప్రబోధాలుచేసేస్తారు. ఎవరైనా రోగులు ధైర్యం చేసి నిల దీస్తే మాత్రం.. ఆస్పత్రి సిబ్బంది ‘మందుల స్టాక్‌ లేదు’ అంటూ  కుండబద్దలు కొట్టేస్తారు. గత గురువారం కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్‌ దవాఖానను సందర్శించారు.lఆ సమయంలో ములుగు ఆస్పత్రిలో ఔషధాల పంపిణీ పడకేసిన తీరుపై రోగులు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. గత జూలైతో వాడకం గడువు(ఎక్స్‌పరీ డేట్‌) ముగిసిన మందులను ఆస్పత్రి వెనుకభాగంలో పారవేశారు. అంటే ఆస్పత్రిలో మందులు ఉన్నా.. రోగులకు ఇవ్వడం లేదా? అనే ప్రశ్న తలెత్తుతోంది.  దీనికి సమా ధానం చెప్పాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement