ప్రపంచంలోనే అత్యంత సంపన్న కుటుంబం! ఏకంగా 700 కార్లు.. | This World's Richest Family Owns 700 Car Rs 4000 Crore Palace - Sakshi

ప్రపంచంలోనే అత్యంత సంపన్న కుటుంబం! ఏకంగా 700 కార్లు, నాలుగు వేల కోట్లు..

Jan 19 2024 1:57 PM | Updated on Jan 19 2024 8:17 PM

T​his Worlds Richest Family Owns 700 Cars Rs 4000 Crore Palace - Sakshi

ప్రపంచంలోనే అత్యంత ధనిక కుటుంబం. ఆ కుటుబంలోని వ్యక్తులంతా విలాసవంతమైన జీవితాన్ని అనుభవిస్తున్నారు. వాళ్లు ఉండే ఫ్యాలెస్‌ ఏకంగా మూడు పెంటాగాన్‌ భవనాల పరిమాణంలో ఉంటుంది). సంతానం, తోబుట్లువులు కూడా ఎక్కువ మందే. పైగా అందరూ అత్యంత లగ్జరీ జీవితాన్ని గడుపుతున్నారు. ఆ కుటుంబ సభ్యులంతా ప్రముఖ కంపెనీలన్నింటిలో అత్యధిక శాతం వాటాలను కలిగి ఉన్నారు. ఇంతకీ ఆ అత్యంత ధనిక కుటుంబం ఏదంటే..

యూఏఈ అధ్యక్షుడు షేక్‌ మొహమ్మద్‌ బిన్‌ జాయెద్‌ అల్‌ నహ్యాన్‌ కుటుంటం. ఆయన పేరులోని మొదటి అక్షరాలతో ఎంబీజెడ్‌గా పిలుస్తారు. ఈయనే కుటుంబ పెద్ద. అతని కుటుబమే అత్యంత ధనిక రాయల్‌ కుటుంబంగా ఉంది. ఆయనకు 11 మంది సోదరీమణులు, తొమ్మది మంది పిల్లలు, సుమారు 18 మంది దాక మనవళ్లు మనవరాళ్లు ఉన్నారు. ప్రపంచంలోని చమురు నిల్వల్లో దాదాపు ఆరు శాతం ఆ కుటుంబమే సొంతం చేసుకుంది. అలాగే మాంచెస్టర్‌ సిటీ ఫుట్‌బాల్‌ క్లబ్‌ వంటి అనేక ప్రసిద్ధ కంపెనీల్లో అత్యధిక వాటా కలి ఉన్నారు. ఎలోన్‌ మస్క్‌ స్పెసఎక్స్‌ కంపెనీ నుంచి ప్రముఖ గాయకుడు బ్యూటీ బ్రాండ్‌ ఫెంటీ వంటి కంపెనీలన్నింటిలో ఈ రాయ​ల్‌ కుటుంబ సభ్యులే వాటాలు కలిగి ఉన్నారు.

అధ్యక్షుబు షేక్‌ మొహమ్మద్‌ బిన్‌ తమ్ముడు షేక్‌ హమద్‌ బిన్‌ హమ్దాన్‌ అల్‌ నహ్యాన్‌కే ప్రపంచంలోని అతిపెద్ద ఎస్‌యూవీ, మెర్సిడెస్‌ బెంజ్‌, వంటి లగ్జరీ కార్లు దాదాపు 700 పైచిలుకు ఉన్నాయి. ఆ కుటుంబ సుమారు 94 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న అతిపెద్ద ప్యాలెస్‌లో నివశిస్తోంది. దాని విలువ నాలుగు వేల కోట్లు ఉంటుంది. ఆ కుటుంబానికి సంబధించని ప్రధాన ఇన్విస్టెమెంట్‌ కంపెనీకి ఆయన మరో సోదరుడు బిన్‌ జాయెద్‌ అల్‌ నహ్యాన్‌ నిర్వహిస్తున్నారు. దీని విలువ గత ఐదేళ్లలో దాదాపు 2 లక్షల పర్సంటేజ్‌ వరకు పెరిగింది. ఐతే ప్రస్తుతం ఆ కంపెనీ విలువ లక్ష కోట్లు. ఇది వ్యవసాయం, ఇందనం, వినోదం, సముద్ర వ్యాపారాలు వంటివి నిర్వహిస్తుంది.

సుమారు పదివేల మందికి ఉపాధి కూడా కల్పిస్తోంది. ఈ కుటుంబానికి యూఏఈలోనే కాకుండా పారిస్‌, లండన్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో అత్యంత లగ్జరీ ఆస్తులు ఉన్నాయి. ఈ యూఏఈ అధ్యక్షుడికి యూకేలోని అత్యంత ఖరీదైన ప్రాంతంలో పెద్దమొత్తంలో ఆస్తులు ఉండటంతో ఆయన్ని ‘ల్యాండ్ లార్డ్ ఆఫ్ లండన్’(లండన్‌ భూస్వామి)  అని కూడా పిలుస్తారు. అంతేగాదు న్యూయార్క్‌ నివేదిక ప్రకారం 2015లో ఈ దుబాయ్‌ రాజకుటుంబం బ్రిటీష్‌ రాజ కుటుంబంతో సరితూగేలా ఆస్తులను కలిగి ఉందని పేర్కొంది. అతేగాదు 2008లో అధ్యక్షుడు ఎంబీజెడ్‌కి చెందిన అబుదాబి యునైటెడ్‌ గ్రూప్‌ యూకే ఫుట్‌బాల్‌ జట్టు మాంచెస్టర్‌ సిటీని సుమారు రెండు వేల కోట్లకు కొనుగోలు చేసింది. మాంచెస్టర్ సిటీ, ముంబై సిటీ, మెల్‌బోర్న్ సిటీ, న్యూయార్క్ సిటీ ఫుట్‌బాల్ క్లబ్‌లను నిర్వహిస్తున్న సిటీ ఫుట్‌బాల్ గ్రూపులో 81 శాతం ఈ అబుదాబి కంపెనీ యాజమాన్యంలోనే ఉంది.

(చదవండి: అయోధ్యలోని రామాలయ ప్రారంభోత్సవాన్ని..57 ఏళ్ల క్రితమే ఊహించారా?)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement