![Person Set Fire to House, Escape in Chennai - Sakshi](/styles/webp/s3/article_images/2018/03/1/11.jpg.webp?itok=HCwXcekg)
దగ్ధమైన ఇంటి పైకప్పు
సాక్షి, అన్నానగర్: మద్యం తాగడానికి డబ్బులు ఇవ్వకపోవడంతో ఆగ్రహించిన ఓ యువకుడు బంధువుల ఇంటికి నిప్పుపెట్టాడు. ఈ ఘటన చెన్నైలోని కుమారపురం సమీపంలో మంగళవారం చోటుచేసుకుంది. మంటలు పెట్టిన యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు.. తక్కలై సమీపం కుమారపురం, శాంతమ్మ(70) భర్త మృతిచెందడంతో తక్కలై సమీపం కుమారపురం ఒంటరిగా నివశిస్తోంది. ఈమె బంధువుల కుమారుడు రఘు(33) . అతను కార్మికుడిగా పనిచేస్తున్నాడు.
ఇతను శాంతమ్మ ఇంటి సమీపంలో నివసిస్తున్నాడు. రఘుకి మద్యం సేవించే అలవాటు ఉంది. తరచూ శాంతమ్మ దగ్గర మద్యం తాగడానికి డబ్బులు ఇవ్వాలని వేధించేవాడు. ఎప్పటిలాగే మంగళవారం రఘు మద్యం సేవించడానికి నగదు అడిగాడు. ఇందుకు శాంతమ్మ అంగీకరించలేదు. ఆవేశంతో రఘు శాంతమ్మ ఇంటికి మంటలు అంటించి పరారయ్యాడు. గమినించిన స్థానికులు వెంటనే మంటలను ఆర్పారు. అంతలోనే ఇంటి పైకప్పు మొత్తం కాలి బూడిదైంది. కొట్రికాడు పోలీసులు కేసు నమోదు చేసి రఘుని అరెస్టు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment