set fire to house
-
ఇంటికి నిప్పంటించిన దుండగులు.. గాఢ నిద్రలో కుటుంబం.. క్షణాల్లో..
న్యూఢిల్లీ: ఈశాన్య ఢిల్లీ భజన్‌పురలోని వినయ్ పార్కులో భయానక ఘటన జరిగింది. ముసుగు ధరించిన ఇద్దరు దుండగులు అమానవీయ ఘటనకు పాల్పడ్డారు. ఓ ఇంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. అనంతరం అక్కడి నుంచి పారిపోయారు. అదృష్టవశాత్తు ఆ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు వెంటనే నిద్రలేచారు. మంటలు ఇల్లంతా అంటుకోకముందే ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటనలో వాళ్లుకు ఎలాంటి గాయాలు కాలేదు. అయితే ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో ముసుగు ధరించిన దుండగులు నఫీజ్ ఇంటి వద్దకు వెళ్లినట్లు ఉంది. అనంతరం ఇద్దరిలో ఒకడు తన వెంట తెచ్చుకున్న పెట్రోల్ ఇంటి గడపపై పోశాడు. అనంతరం మరొకడు అగ్గిపుల్ల అంటించి విసిరాడు. మంట అంటుకోకపోవడంతో మరోసారి విసిరాడు. చివరకు ముడో ప్రయత్నంలో మంట అంటుకుని చెలరేగింది. వెంటనే వెంటనే ఇద్దరు అక్కడి నుంచి పారిపోయారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అయితే నిందితులను ఇంకా గుర్తించలేకపోయారు. వాళ్లు నఫీజ్‌కు తెలిసినవాళ్లేనా అని ఆరా తీస్తున్నారు. త్వరలోనే దుండగులను పట్టుకుంటామన్నారు. చదవండి: యువతిని కారుతో ఈడ్చుకెళ్లిన ఘటన.. కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం -
భార్యపై కోపం.. బామ్మర్ది ఇంటికి నిప్పు.. ఆరుగురు సజీవదహనం
సాక్షి, బెంగళూరు: ఓ తాగుబోతు పైశాచికత్వానికి ఆరుగురు బలయ్యారు. ఇంటికి రానన్న భార్యపై కోపంతో.. బావమరిది ఇంటిని తగలబెట్టాడు. దీంతో ముగ్గురు మంటల్లో సజీవదహనమవగా మరో ముగ్గురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. మృతుల్లో నలుగురు చిన్నారులే. కర్ణాటకలోని కొడగు జిల్లా కనూరులో ఈ ఘోరం జరిగింది. కనూరుకు చెందిన బోజ అనే వ్యక్తి మద్యానికి బానిసై భార్య బేబీతో తరచూ గొడవపడేవాడు. ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం కూడా బోజ తన భార్యతో గొడవపడ్డాడు. భర్త ఆగడాలను భరించలేకపోయిన బేబీ.. కనూరులోనే ఉంటున్న తన సోదరుడు మంజు ఇంటికి పిల్లలతో సహా వెళ్లింది. మద్యం మత్తులో ఉన్న బోజ.. మంజు ఇంటికి వెళ్లి బేబీని రావాలని కోరగా ఆమె ససేమిరా అంది. అప్పటికి వెళ్లిపోయిన బోజ.. మళ్లీ అర్ధరాత్రి దాటిన తర్వాత మంజు ఇంటికి వచ్చాడు. బయట తాళాలు వేసి ఇంటిపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టి పారిపోయాడు. ఇంట్లో బోజ కుటుంబసభ్యులు నలుగురు, మంజు కుటుంబానికి చెందిన మరో నలుగురున్నారు. అర్ధరాత్రి కావడంతో అందరూ గాఢనిద్రలో ఉన్నారు. ఇల్లు మొత్తం మంటలు వ్యాపించాయి. బయటికి వెళ్లలేక బేబీ (40), సీత (45), ప్రార్థన (6) మంటల్లోనే కాలిపోయి చనిపోయారు. స్థానికులు అందించిన సమాచారంతో ఘటనాస్థలికి వచ్చిన ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. తీవ్రంగా గాయపడిన ఐదుగురిని మైసూరులోని కేఆర్ ఆస్పత్రికి తరలించగా.. విశ్వాస్ (3), ప్రకాశ్ (6), విశ్వాస్ (7) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. భాగ్య (40), పాచె (60) ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. -
మద్యం మత్తులో ఆకతాయి చేష్ట.. ముగ్గురు సజీవ దహనం
బెంగళూరు : కర్ణాటకలోని కొడగు జిల్లాలో అమానుష ఘటన చోటుచేసుకుంది. కనూరు గ్రామంలో మద్యం మత్తులో మునిగిపోయిన ఓ ఆకతాయి ఇంటికి తాళం వేసి నిప్పంటించాడు. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది మంటల్లో చిక్కుకున్నారు. వీరిలో ముగ్గురు సజీవ దహనం కాగా తీవ్రంగా గాయపడిన మరో అయిదుగురిని ఆసుపత్రిలో చేర్పించారు. ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మరో ముగ్గురు మృతి చెందారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు. చదవండి: కాకినాడలో ఆర్టీసీ బస్సులో చెలరేగిన మంటలు సీడీ కేసు: సిట్ విచారణకు రమేశ్ జార్కిహోళి గైర్హాజరు -
ప్రేమవివాహం: పెళ్లికొడుకు ఇంటికి నిప్పు
గుంతకల్లు /అనంత: పెద్దలను కాదని ప్రేమ వివాహం చేసుకున్నారన్న ఆక్రోశంతో పెళ్లికొడుకు ఇంటికి పెళ్లికూతురు బంధువులు నిప్పంటించిన ఘటన నాగసముద్రంలో ఆదివారం చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని వెంకటాంపల్లికి చెందిన బోయ మల్లికార్జున కూతురు సుమిత్ర గ్రామ వలంటీర్‌గా పనిచేస్తోంది. నాగసముద్రం గ్రామానికి చెందిన నాగప్ప కుమారుడు హేమంత్ ఇంటర్ వరకూ చదివి వ్యవసాయం చేసుకుంటున్నాడు. వీరిద్దరూ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. రెండు రోజుల క్రితం వీరిద్దరూ ఇళ్ల నుంచి వెళ్లిపోయి ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆదివారం రూరల్ పోలీస్ స్టేషన్లో హాజరయ్యారు. వీరిద్దరూ మేజర్లు కావడంతో తల్లిదండ్రులను పిలిపించి సర్దిచెప్పి పంపించారు. ప్రస్తుత పరిస్థితుల్లో వారిని తమ ఇంట్లో పెట్టుకుంటే సమస్యలు వస్తాయని భావించిన పెళ్లికొడుకు తల్లిదండ్రులు నూతన వధూవరులను బంధువుల ఇంటికి పంపించారు. ఈ క్రమంలో పెళ్లికూతురు సుమిత్ర తరఫు బంధువులు కొందరు ఆదివారం సాయంత్రం నాగసముద్రంలోని పెళ్లికొడుకు హేమంత్ ఇంటిపై కిరోసిన్ పోసి నిప్పంటించారు. చుట్టుపక్కల వారు మంటలు ఆర్పివేయడంతోపాటు ఈ ఘటనకు పాల్పడ్డ వారిని మందలించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే గ్రామానికి చేరుకున్న పోలీసులు నిప్పంటించిన వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. -
మందు కోసం ఓ యువకుడి దుశ్యర్య..
సాక్షి, అన్నానగర్: మద్యం తాగడానికి డబ్బులు ఇవ్వకపోవడంతో ఆగ్రహించిన ఓ యువకుడు బంధువుల ఇంటికి నిప్పుపెట్టాడు. ఈ ఘటన చెన్నైలోని కుమారపురం సమీపంలో మంగళవారం చోటుచేసుకుంది. మంటలు పెట్టిన యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు.. తక్కలై సమీపం కుమారపురం, శాంతమ్మ(70) భర్త మృతిచెందడంతో తక్కలై సమీపం కుమారపురం ఒంటరిగా నివశిస్తోంది. ఈమె బంధువుల కుమారుడు రఘు(33) . అతను కార్మికుడిగా పనిచేస్తున్నాడు. ఇతను శాంతమ్మ ఇంటి సమీపంలో నివసిస్తున్నాడు. రఘుకి మద్యం సేవించే అలవాటు ఉంది. తరచూ శాంతమ్మ దగ్గర మద్యం తాగడానికి డబ్బులు ఇవ్వాలని వేధించేవాడు. ఎప్పటిలాగే మంగళవారం రఘు మద్యం సేవించడానికి నగదు అడిగాడు. ఇందుకు శాంతమ్మ అంగీకరించలేదు. ఆవేశంతో రఘు శాంతమ్మ ఇంటికి మంటలు అంటించి పరారయ్యాడు. గమినించిన స్థానికులు వెంటనే మంటలను ఆర్పారు. అంతలోనే ఇంటి పైకప్పు మొత్తం కాలి బూడిదైంది. కొట్రికాడు పోలీసులు కేసు నమోదు చేసి రఘుని అరెస్టు చేశారు. -
ఆస్తి పంపకాల్లో అన్యాయం జరిగిందని ఇంటికి నిప్పు
హైదరాబాద్: ఆస్తి పంపకాల్లో తనకు అన్యాయం జరిగిందని ఆగ్రహించిన ఓ యువకుడు ఇంట్లోని వస్తువులకు నిప్పుపెట్టాడు. ఈ ఘటన ఆదివారం రెయిన్‌బజార్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్సై సత్యనారాయణ తెలిపిన వివరాలివీ.. యాకుత్‌పురా తలాసాబ్కీ గల్లీ ప్రాంతానికి చెందిన జమాల్ షరీఫ్ (75)కు ముగ్గురు కుమారులు ఉస్మాన్, రియాజ్, తహేర్ ఉన్నారు. కాగా, కొన్ని నెలల క్రితం తన ఆస్తిని ముగ్గురు కుమారులకు సమానంగా పంచి పెట్టాడు. రెండో కుమారుడు రియాజ్ కొన్ని రోజుల క్రితం మృతి చెందాడు. అయితే, ఆస్తి పంపకాల్లో తనకు అన్యాయం జరిగిందంటూ ఆటో డ్రై వర్ తహేర్ నిత్యం తల్లితో గొడవ పడేవాడు. ఈక్రమంలోనే ఆదివారం సాయంత్రం పెట్రోల్ బాటిల్‌తో వచ్చిన తహేర్ ఇంట్లో పెట్రోల్ పోసి తగలబెట్టాడు. దీంతో ఫ్రీజ్, టీవీ, బీరువా తదితర వస్తువులతో పాటు ’ 10 వేల నగదు కాలిపోయాయి. స్థానికులు మంటలను ఆర్పివేశారు.