ముంబయి: బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై ఇటీవల కత్తితో దాడి చేసిన కేసులో తొలుత అరెస్టయిన అనుమానితుడు సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ కేసులో తొలుత ఆకాశ్ కనోజియా అనే అనుమానితుడిని ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్ రైల్వేస్టేషన్‌లో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే పోలీసుల తదుపరి విచారణలో అసలు నిందితుడు ఆకాశ్ కాదని తేలడంతో పోలీసులు అతడిని వదిలిపెట్టారు.
సైఫ్ కేసులో అరెస్టు తర్వాత తన జీవితం సర్వనాశనమైందని ఆకాశ్ పేర్కొన్నాడు. డ్రైవర్‌గా పనిచేస్తున్న తాను ఉద్యోగం కోల్పోవడం, పెళ్లి సంబంధం చెడిపోవడంతో పాటు తన కుటుంబం ఎన్నో అవమానాలు ఎదుర్కొంటోందని ఆవేదన వ్యక్తం చేశాడు. సైఫ్ కేసులో ప్రధాన అనుమానితుడినని చెబుతూ మీడియాలో నా ఫొటోలు వేశారు. ఫొటోలు చూసిన మా కుటుంబం షాక్‌కు గురైంది.
నాకు కాబోయే భార్యను కలిసేందుకు వెళ్తుండగా దుర్గ్‌లో నన్ను అదుపులోకి తీసుకొని రాయ్‌పూర్‌కు తరలించారు. అక్కడికి వచ్చిన ముంబయి పోలీసులు నాపై దాడి కూడా చేశారు’ అని ఆకాశ్ తెలిపాడు. పోలీసులు విడిచిపెట్టిన తర్వాత ఉద్యోగం కూడా పోయిందని, నాతో వివాహం వద్దని అమ్మాయి తరఫు కుటుంబీకులు నిర్ణయించుకున్నారని చెప్పాడు. అయితే తనపై ఇప్పటికే రెండు కేసులు ఉన్నమాట నిజమేనన్నాడు.
ఇటీవల సైఫ్‌అలీఖాన్‌పై ముంబయి బాంద్రాలోని ఆయన నివాసంలోనే దాడి జరిగిన విషయం తెలిసిందే. దొంగతనానికి వచ్చిన దుండగున్ని అడ్డుకుంటుండగా అతడు సైఫ్‌పై కత్తితో దాడి చేశాడు. దీంతో తీవ్ర గాయాలపాలైన సైఫ్ లీలావతి ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుని డిశ్చార్జ్ అయి ఇంటికి వచ్చారు. ఈ కేసులో నిందితుడితో దగ్గరి పోలికలు ఉండడంతో పోలీసులు ఆకాశ్‌ను ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్‌లో అరెస్టు చేసి తర్వాత నాలిక్కరచుకొని వదిలిపెట్టారు.
Comments
Please login to add a commentAdd a comment