ఆర్టీసీబస్సులో గుర్తుతెలియని వ్యక్తి మృతి | in RTC bus unknown person died | Sakshi
Sakshi News home page

ఆర్టీసీబస్సులో గుర్తుతెలియని వ్యక్తి మృతి

Published Thu, Jul 28 2016 10:16 PM | Last Updated on Fri, Sep 28 2018 3:41 PM

ఆర్టీసీబస్సులో గుర్తుతెలియని వ్యక్తి మృతి - Sakshi

ఆర్టీసీబస్సులో గుర్తుతెలియని వ్యక్తి మృతి

రామన్నపేట
ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న గుర్తుతెలియని వ్యక్తి  మృతిచెందాడు. ఈ ఘటన గురువారం చోటుచేసుకుంది. తోటి ప్రయాణికులు తెలిపిన వివరాలప్రకారం.. కాషాయవస్త్రాలు ధరించిన సమారు 45 సంవత్సరాల వయసు గల వ్యక్తి వలిగొండ వద్ద బస్సు ఎక్కి చిట్యాలవరకు టికెట్‌ తీసుకున్నాడు. నాగారం వద్దకు రాగానే అతనికి ఫిట్స్‌ వచ్చాయి.  తోటి ప్రయాణికులు అతనికి ప్రథమ చికిత్స అందించారు.  బస్సు రామన్నపేటకు చేరుకోగానే స్థానిక ఏరియా ఆస్పత్రికి తీసుకువెళ్తుండగా మృతిచెందాడు. మృతదేహాన్ని స్థానిక ఏరియా ఆస్పత్రి మార్చురీలో భద్రపరిచారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement