rtcbus
-
TSRTC గరుడ బస్సు లో మంటలు
-
జనగామ: ఏసీ బస్సులో చెలరేగిన మంటలు
సాక్షి, జనగామ: జనగామ జిల్లాలో ప్రయాణిస్తున్న ఆర్టీసీ బస్సులో మంటలు చెలరేగాయి. స్టేషన్ ఘన్పూర్ ప్రాంతంలో ఫ్లైఓవర్ ఎక్కుతుండగా ఏసీ బస్సులో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. హన్మకొండ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు వెనుక భాగంలో మంటలు అంటుకున్నాయి. వెంటనే డ్రైవర్ అప్రమత్తం అవ్వడంతో ప్రయాణికులందరిని కిందకు దింపేశాడు. దీంతో బస్సులో ప్రాయణిస్తున్న 29 మంది ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. ఈ ప్రమాదంలో బస్సు పూర్తిగా దగ్ధమైంది. -
చోరీ సొమ్ముతో చోరులకు ఫైనాన్స్!
సాక్షి, సిటీబ్యూరో: సిటీలో రద్దీగా ఉన్న ఆర్టీసీ బస్సులను టార్గెట్‌గా చేసుకుని, తన ముఠా సాయంతో బంగారు గొలుసులు, పర్సులను తస్కరించే ఘరానా దొంగ కేఎస్ ధరమ్‌ను దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే పలుమార్లు అరెస్టైన ఇతడిపై ఇప్పటి వరకు 25 కేసులు ఉన్నాయని, తాజాగా ఎనిమిది కేసుల్లో అరెస్టు చేసినట్లు అదనపు డీసీపీ ఎస్.చైతన్యకుమార్ శుక్రవారం వెల్లడించారు. ధరమ్ ముఠా ప్రధానంగా మూడు రూట్లలో తిరిగే బస్సుల్లో, అదీ వెనుక డోర్ నుంచి దిగే ప్రయాణికుల్నే ఎంచుకుని పంజా విసురుతారన్నారు. ఇలా వచ్చిన సొత్తును విక్రయించగా వచ్చిన సొమ్ముతో నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన దొంగలకు ఫైనాన్స్ చేస్తాడని తెలిపారు. అఫ్జల్‌సాగర్ (మాన్గార్‌బస్తీ) ప్రాంతానికి చెందిన ధరమ్ వృత్తిరీత్యా కూలీ. కొన్నేళ్ళుగా ఏడెనిమిది మందితో ముఠా ఏర్పాటు చేశాడు. వీరు 8 ఏ, 8 ఎం, 2 జే రూట్లలో తిరిగే రద్దీ బస్సుల్నే టార్గెట్‌గా చేసుకుంటారు. ఏ సందర్భంలో బస్టాప్‌లో బస్సు ఎక్కడం, దిగడం చేయరు. సిగ్నల్స్ వద్ద, బస్సులు స్లోగా నడిచే ప్రాంతాల్లోనే బస్సు ఎక్కుతారు. బస్సు వెనుక డోర్ వద్ద నిల్చున్న వారిలో ఎక్కువగా వృద్ధుల్ని టార్గెట్‌గా చేసుకుంటారు. వారి చుట్టూ చేరే ఈ ముఠా సభ్యులు హల్చల్ చేస్తూ ఒత్తిడి కలిగిస్తారు. అదును చూసుకుని వారి మెడలో ఉన్న గొలుసు కత్తిరించడం లేదా జేబులో ఉన్న డబ్బు, పర్సు చోరీ చేసేస్తారు. పని పూర్తయిన వెంటనే ఆ సొత్తు/సొమ్ముతో ఓ ముఠా సభ్యుడు బస్సు దిగేస్తాడు. కాస్త తేడాతో మిగిలిన వారూ బస్సు దిగిపోతారు. అయితే ఏ సందర్భంలోనూ వీళ్ళు స్టాప్ వచ్చే వరకు ఆగి దిగరు. ఇలా వచ్చిన సొత్తును విక్రయించగా వచ్చిన సొమ్ముతో ఎక్కువ భాగం తీసుకునే గ్యాంగ్ లీడర్ ధరమ్ మిగిలిన మొత్తం సభ్యులకు పంచుతాడు. తన వాటాగా వచ్చిన సొమ్ముతో అఫ్జల్‌సాగర్ కేంద్రంగా ఫైనాన్స్ వ్యాపారం చేస్తుంటాడు. ఆ ప్రాంతంతో పాటు పలు ప్రాంతాలకు చెందిన చోరులతో ఇతడికి సంబంధాలు ఉన్నాయి. వారు చోరీ చేసుకు వచ్చిన సొత్తును తాకట్టు పెట్టుకుని డబ్బు ఇస్తుంటాడు. రూ.30 వేల సొత్తుకు కేవలం రూ.10 వేలు మాత్రమే ఇచ్చి 3 నుంచి 20 శాతం వరకు వడ్డీగా వసూలు చేస్తాడు. గతంలో సుల్తాన్‌బజార్, షాహినాయత్‌గంజ్ తదితర ఠాణాల్లో ఇతడిపై 25 కేసులు నమోదయ్యాయి. 2014 నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిన అతను ఆ సమయంలో గ్యాంగ్‌తో కలిసి అనేక చోరీలు చేశాడు. అయితే బహదూర్‌పుర, కంచన్‌బాగ్, బేగంబజార్, హుయామున్‌నగర్, నాంపల్లి ఠాణాల్లో 8 కేసులు మాత్రం నమోదయ్యాయి. సౌత్ జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఎస్.రాఘవేంద్ర నేతృత్వంలో ఎస్సైలు వి.నరేందర్, ఎన్.శ్రీశైలం, మహ్మద్ థక్రుద్దీన్లతో ఏర్పడిన బృందం శుక్రవారం అతడిని అదుపులోకి తీసుకుంది. ఇతడి నుంచి రూ.4.15 లక్షల విలువైన బంగారం, నగదు స్వాధీనం చేసుకున్నారు. తదుపరి చర్యల నిమిత్తం నిందితుడిని కంచన్‌బాగ్ పోలీసులకు అప్పగించారు. ఇతడి ముఠా సభ్యులు ప్రస్తుతం ఎక్కడ ఉన్నారు? ఏం చేస్తున్నారు? అనే కోణాల్లో ఆరా తీస్తు వారి కోసం గాలిస్తున్నారు. ధరమ్ నేరచరిత్రను పరిగణలోకి తీసుకున్న నేపథ్యంలో అతడిపై పీడీ యాక్ట్ ప్రయోగించాలని నిర్ణయించినట్లు అదనపు డీసీపీ తెలిపారు. -
ఆటోను ఢీకొన్న ఆర్టీసీ బస్సు..ఇద్దరి మృతి
గోపాల్పేట్(వనపర్తి జిల్లా): గోపాల్పేట్ మండలం తాటిపర్తి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ముందు వెళ్తున్నఆటోను వెనక నుంచి ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఇద్దరు ప్రయాణికులు అక్కడికక్కడే మృతిచెందగా..మరో ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి. ఆటో గోపాల్పేట్ నుంచి వనపర్తికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో వనపర్తికి చెందిన బాలేమియా(70), నర్సింగావపల్లికి చెందిన గొల్లమణ్యం(65) అక్కడికక్కడే మృతిచెందారు. గాయపడిన వారిని వనపర్తి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
బస్సు సౌకర్యం కల్పించాలని విద్యార్థుల ధర్నా
నడిగూడెం: మండల పరిధిలోని సిరిపురం గ్రామానికి కోదాడ నుంచి ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలంటూ సోమవారం ఆ గ్రామానికి చెందిన విద్యార్థులు సిరిపురంలో చెన్నకేశ్వాపురంలో ఆర్టీసీ బస్సును అడ్డుకొని ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు మాట్లాడుతూ కళాశాలలు ప్రారంభమై రెండు నెలలు కావస్తున్నా సంబంధిత అధికారులు మాత్రం సిరిపురానికి బస్సు సౌకర్యం కల్పించడంలేదన్నారు. బస్సు సౌకర్యం లేకపోవడంతో సిరిపురం, వల్లాపురం, త్రిపురవరం గ్రామాలకు చెందిన వందలాది మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నట్లు వారు తెలిపారు. సంబంధిత అధికారులు స్పందించి తక్షణమే బస్సు సౌకర్యం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. -
ఆర్టీసీబస్సులో గుర్తుతెలియని వ్యక్తి మృతి
రామన్నపేట ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన గురువారం చోటుచేసుకుంది. తోటి ప్రయాణికులు తెలిపిన వివరాలప్రకారం.. కాషాయవస్త్రాలు ధరించిన సమారు 45 సంవత్సరాల వయసు గల వ్యక్తి వలిగొండ వద్ద బస్సు ఎక్కి చిట్యాలవరకు టికెట్ తీసుకున్నాడు. నాగారం వద్దకు రాగానే అతనికి ఫిట్స్ వచ్చాయి. తోటి ప్రయాణికులు అతనికి ప్రథమ చికిత్స అందించారు. బస్సు రామన్నపేటకు చేరుకోగానే స్థానిక ఏరియా ఆస్పత్రికి తీసుకువెళ్తుండగా మృతిచెందాడు. మృతదేహాన్ని స్థానిక ఏరియా ఆస్పత్రి మార్చురీలో భద్రపరిచారు.