గోపాల్‌పేట్(వనపర్తి జిల్లా): గోపాల్‌పేట్ మండలం తాటిపర్తి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ముందు వెళ్తున్నఆటోను వెనక నుంచి ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఇద్దరు ప్రయాణికులు అక్కడికక్కడే మృతిచెందగా..మరో ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి. ఆటో గోపాల్‌పేట్ నుంచి వనపర్తికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో వనపర్తికి చెందిన బాలేమియా(70), నర్సింగావపల్లికి చెందిన గొల్లమణ్యం(65) అక్కడికక్కడే మృతిచెందారు. గాయపడిన వారిని వనపర్తి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.