వ్యాధి నయం కావడం లేదని మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి ఇంటి ముందున్న చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు.
లేపాక్షి: వ్యాధి నయం కావడం లేదని మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి ఇంటి ముందున్న చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన అనంతపురం జిల్లా లేపాక్షి మండలం సోమిరెడ్డిపల్లి గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన నరసింహమూర్తి(38) గత కొన్ని రోజులుగా ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్నాడు. ఇక వ్యాధి నయం కాదని మనస్తాపానికి గురైన నర్సింహమూర్తి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.