comitted
-
భర్త వేధింపులతో వివాహిత ఆత్మహత్య
అనంతసాగరం: భర్త వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం లింగంగుంట గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన సుమతి(25)కి అదే గ్రామానికి చెందిన సుధాకర్(33)తో ఏడేళ్ల కింద వివాహం జరిగింది. వీరికి ప్రశాంతి(5), నిర్మల(3) ఇద్దరు పిల్లలు. గత కొన్ని రోజులుగా సుధాకర్ రోజూ తాగొచ్చి సుమతిని వేధింపులకు గురి చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి కూడా సుధాకర్ మద్యం సేవించి వచ్చాడు. వీరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ గొడవతో మనస్తాపం చెందిన సుమతి పురుగుల మందు మింగింది. వెంటనే సుధాకర్ ఆమెను ఆత్మకూరులోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించాడు. సుమతి చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఆటో డ్రైవర్ ఆత్మహత్య
సికింద్రాబాద్: కుటుంబ కలహాల కారణంగా ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన తుకారాంగేట్ పోలీస్‌స్టేసన్ పరిధిలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం..అడ్డగుట్టకు చెందిన వేణుగోపాల్(28) వృత్తిరిత్యా ఆటోడ్రైైవర్. మద్యానికి బానిసైన వేణుగోపాల్ తరచూ ఇంట్లో గొడవపడేవాడు. అయితే, సోమవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. -
మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్య
లేపాక్షి: వ్యాధి నయం కావడం లేదని మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి ఇంటి ముందున్న చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన అనంతపురం జిల్లా లేపాక్షి మండలం సోమిరెడ్డిపల్లి గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన నరసింహమూర్తి(38) గత కొన్ని రోజులుగా ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్నాడు. ఇక వ్యాధి నయం కాదని మనస్తాపానికి గురైన నర్సింహమూర్తి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.